The Family Man Season 2: తెలుగు ‘ఫ్యామిలీ మ్యాన్‌’ ఎప్పుడు వస్తుంది?

జూన్‌ 4 ఎప్పుడు వస్తుందా? ఫ్యామిలీ మ్యాన్‌ సెకండ్‌ సిరీస్‌ ఎప్పుడు చూసేద్దామా అని ఎదురుచూసిన తెలుగు అభిమానులకు నిరాశే ఎదురైంది. అనుకున్న సమయం కంటే ముందే ‘ఫ్యామిలీ మ్యాన్‌’ స్ట్రీమింగ్‌ మొదలైంది. అయితే తెలుగు వెర్షన్‌ మాత్రం రాలేదు. దీంతో సమంతను నెవర్‌ బిఫోర్‌ రోల్‌లో చూసి ఎంజాయ్‌ చేద్దామనుకున్న అభిమానులు… ‘ప్చ్..’ అంటూ కునుకేసేశారు. మరికొంతమందైతే హిందీలో చూసేద్దాం అని చూసేస్తున్నారు. మనోజ్ బాజ్‌పాయ్‌ను ప్రధానంగా తీసుకొని హిందీలో సిరీస్‌ను రూపొందిస్తున్నారు.

దానిని తెలుగు, తమిళం, ఇంగ్లిష్‌లోకి డబ్‌ చేస్తున్నారు. తొలి సిరీస్‌ ఇలా నాలుగు భాషల్లో వచ్చింది. దీంతో రెండో సిరీస్‌ కూడా అలాగే తీసుకొస్తారు అని అందరూ అనుకున్నారు. అయితే ఎక్కడో చిన్న డౌట్‌. ‘మీర్జాపూర్‌ 2’ తరహాలో లేట్‌గా తెలుగు యాడ్‌ చేస్తారేమో అని డౌట్‌. అనుకున్నట్లే జరిగింది. కేవలం హిందీలోనే ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వచ్చింది. ఇతర భాషలు మరో వారం తర్వాత యాడ్‌ చేస్తారని అంటున్నారు.

‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ విషయంలో తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్నాయి. తమిళ యువతిని ఉగ్రవాదిగా చూపించారు… అందుకే సిరీస్‌ను విడుదల చేయొద్దు అంటూ వివిధ వర్గాల నుండి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందీలో మాత్రమే సిరీస్‌ రిలీజ్‌ చేశారని అనుకుంటున్నారు. హిందీ వెర్షన్‌ వచ్చి సమస్యలు లేకపోతే అప్పుడు తెలుగు, తమిళం యాడ్‌ చేయాలని రాజ్‌ అండ్‌ డీకే ప్లాన్‌ అని తెలుస్తోంది. ఒకవేళ అభ్యంతరాలు వస్తే ‘తాండవ్‌’ సిరీస్‌లా కేవలం హిందీ విడుదల చేసి ఆపేస్తారేమో. ఏదేమైనా సమంత ఫ్యాన్స్‌కు నిరాశేగా.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus