ఈవారం డబుల్ ఎలిమినేషన్ తప్పేగా లేదు..! ఎవరు వెళ్లిపోతారంటే.,

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం నామినేషన్స్ లో అనుకోని సంఘటనలు జరిగినట్లుగా తెలుస్తోంది. హౌస్ మేట్స్ ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగినట్లుగా తెలుస్తోంది. ఎవరినైతే నామినేట్ చేయాలో వారి ఫోటోని తగలబెట్టి రీజన్స్ చెప్పి నామినేట్ చేయాలి. ఇక్కడే గీతుకి మెరీనాకి, అలాగే మెరీనాకి ఆదిరెడ్డికి గట్టి ఫైట్ అయినట్లుగా తెలుస్తోంది. రేవంత్ అంతకుముందు పెరుగుకోసం గీతుతో గొడవపడ్డాడు. నువ్వెవరు నాకు చెప్పడానికి అన్న రేంజ్ లో గొడవ అయ్యింది.

ఇక్కడ్నుంచీ సేఫ్ గేమ్ ఆడింది చాలంటూ గీతు అందర్నీ ఉద్దేశ్యించి చెప్పింది. దీంతో హౌస్ మేట్స్ నామినేషన్స్ లో సేఫ్ గేమ్ గురించే ఎక్కువగా మాట్లాడారు. ఈవారం నామినేషన్స్ లో హౌస్ మొత్తం అందరూ నామినేట్ అయినట్లుగా సమాచారం. ఎందుకంటే, ఈవారం కెప్టెన్ లేడు కాబట్టి, ఈసారి అందరూ నామినేట్ అయ్యారు. వాసంతీ, ఇంకా రోహిత్ ఇద్దరూ ఆల్రెడీ నేరుగా ఈవారం నామినేట్ అయి ఉన్నారు కాబట్టి వారిని ఎవరూ నామినేట్ చేయలేదు.

ఇక మిగతా వారందరినీ ఒకరినొకరు నామినేట్ చేస్కున్నారు. దీంతో ప్రస్తుతం హౌస్ లో ఉన్న అందరూ నామినేట్ అయ్యారు. రోహిత్, మెరీనా, వాసంతీ, ఫైమా, కీర్తి, గీతు, శ్రీసత్య, బాలాదిత్య, ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, ఇనయ, సూర్య, రాజ్ ఇలా అందరూ నామినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈవారం వీరిలో డేంజర్ జోన్ లో ఎవరు ఉంటారంటే., రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, బాలాదిత్య, గీతు వీళ్ల గతవారం సేఫ్ జోన్ లోనే ఉన్నారు. అయితే, ఈవారం వీరి ఆటని బట్టీ ఆధారపడి ఉంటుంది.

ఇక మిగతా హౌస్ మేట్స్ అందరికీ గతవారాల్లో చూస్తే లీస్ట్ ఓటింగ్ జరిగింది. కాబట్టి ఈవారం డబుల్ ఎలిమినేషన్ పెడితే ఇద్దరు హౌస్ మేట్స్ ఇంటికి వెళ్లిపోతారు. హౌస్ లో అందరూ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి, ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ పెట్టే ‌అవకాశం కనిపిస్తోంది. ఈవారం కెప్టెన్సీ టాస్క్ జరిగి ఎవరైనా కెప్టెన్ అయితే మాత్రం వారికి తదుపరి వారం ఇమ్యూనిటీ లభిస్తుంది. ఒకవేళ ఎవిక్షన్ ఫ్రీపాస్ టాస్క్ పెడితే ఈవారం ఒకరు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదీ మేటర్.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!


ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus