గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేసిన మూవీ నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీలో మెహ్రీన్ జర్నలిస్ట్ పాత్ర పోషించగా, నాజర్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషించారు. జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 05 న రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. అయినా విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ కారణంగా (తెలుగు, తమిళ వెర్షన్స్) భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే లాంగ్ రన్ లో భారీ నష్టాన్ని మిగిల్చింది. సినిమా థియేట్రికల్ రైట్స్ వ్యాల్యూ 23 కోట్లు అయితే ఫుల్ రన్ లో నోటా 10 కోట్ల మార్క్ కూడా దాటలేదు. ప్రపంచవ్యాప్తంగా 9.82 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ (తమిళనాడు మినహాయింపు ) తో సరిపెట్టుకుంది. దీంతో నిర్మాత కు దాదాపు సగం వరకు నష్టాలు తప్పలేదు. కలక్షన్స్ వివరాలు ఏరియాల వారీగా.. కోట్లలో..
ఏరియా : కలక్షన్స్ (షేర్ ) నైజాం : 3.42 సీడెడ్ : 1.05 ఉత్తరాంధ్ర : 0.82 గుంటూరు : 0.60 కృష్ణ : 0.53 ఈస్ట్ గోదావరి : 0.58 వెస్ట్ గోదావరి : 0.37 నెల్లూరు : 0.32 ఇతర ప్రాంతాల్లో : 0.83 ఓవర్సీస్ : 1.30 ప్రపంచవ్యాప్తంగా : 9.82