Samantha: సమంత సినిమాకి క్రేజీ డిమాండ్!

సీనియర్ దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ‘శాకుంతలం’. టాలీవుడ్ స్టార్ హీరో సమంత లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మించారు. శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యం కాళిదాసు రచన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమాపై బజ్ పెరిగింది.

ఇందులో సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ ఈ సినిమా హక్కులు సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా రైట్స్ ని దక్కించుకుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సివుంది.

ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అన్నీ సెట్ అవ్వడంతో ఫిబ్రవరిలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. కాగా.. దర్శకుడు గుణశేఖర్ ఇప్పటికే ‘రుద్రమదేవి’ లాంటి చారిత్రాత్మక సినిమాను తెరకెక్కించినందుకు ‘శాకుంతలం’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అదితి బాలన్, గౌతమి, అనన్య నాగళ్ల, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో 2డి, 3డి ఫార్మాట్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus