#ఎన్టీఆర్ 30 గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ముందుగా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కలసి ఆ సినిమా చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. కొబ్బరికాయ కూడా కొట్టేశారు. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా రద్దయిపోయింది. ఆ స్థానంలో కొరటాల శివ సినిమా వచ్చి చేరింది. దీంతో ఇక తారక్ – త్రివిక్రమ్ కలసి పని చేయరా? అని చాలామంది ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్. భవిష్యత్తులో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుందట.
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడానికి క్రియేటివ్ డిఫరెన్స్‌లే కారణమని తొలుత వార్తలొచ్చాయి. ఆ తర్వాత వేరే ఏవో కారణాలు ఉన్నాయి అని అన్నారు. కానీ ఎక్కడ అధికారికంగా ఇదీ సమస్య అని చెప్పలేదు. ఈలోగా సినిమా కోసం ఇచ్చిన కోటి రూపాయల అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేయమని సినిమా నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్‌రామ్ అడిగారని కూడా వినిపించింది. అయితే ఇదంతా జరగలేదని, ఆ అడ్వాన్స్ అలానే ఉందని అంటున్నారు. అంటే అర్థం త్వరలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలసి పని చేస్తారని అంటున్నారు.
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎప్పటినుండో అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ అలాంటి కథ తెచ్చారు. కానీ ఆగిపోయింది. దీంతో కొరటాల శివతో సినిమా ఫిక్స్ చేశారు. ఆ సినిమా కూడా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లోనేనట. అయితే ఈ రెండు పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలే అయినా రెండింటిలోనూ తేడా ఉంటుందట. దీంతో పాత కథతోనే త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఎప్పటిలాగే దీనిపై కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే తన 30వ సినిమా రాజకీయ నేపథ్యం ఉన్న కథతోనే ఎన్టీఆర్ ఎందుకు చేయాలి అనుకుంటున్నాడో ఇంకో వార్తలో చర్చిద్దాం.