‘జై లవకుశ’ లో రాజకీయ నాయకుడిగా కనిపించనున్న ఎన్టీఆర్
- July 24, 2017 / 07:47 AM ISTByFilmy Focus
ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న సినిమా ‘జై లవకుశ’ లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒకరు ‘జై’, సమ సమాజ్ పార్టీ నాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం పూణెలో కొన్ని ముఖ్య సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఓ పక్క ఈ సినిమా షూటింగ్ చేస్తూనే, మరోపక్క వీకెండ్స్‌లో పూణేలోనే ‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్.
ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో నెగెటివ్ షేడ్స్ ఈ క్యారెక్టర్ జై పాత్రతో ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్. ఫుల్ మాస్ యాక్షన్ అవతార్ లో కనిపిస్తున్న జూనియర్ ఈ సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు. సమ సమాజ్ పార్టీ నాయకుడిగా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇటీవల బయటకు వచ్చిన వర్కింగ్ స్టిల్స్ లో ఎన్టీఆర్ ఫోటోతో ఉన్న సమ సమాజ్ పార్టీ జెండాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ కు రెడీ అవుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














