Evaru Meelo Koteeswarulu: రియాలిటీ షో టైమింగ్ అసలు కథ ఇదా?
- August 15, 2021 / 09:47 PM ISTByFilmy Focus
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో వచ్చే నెల 22వ తేదీ నుంచి ప్రసారం కానుంది. బిగ్ బాస్ షో తర్వాత మరో బుల్లితెర షోను హోస్ట్ చేయని ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోతో బుల్లితెరపై సందడి చేయనున్నారు. మే నెల నుంచే ఈ షో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ షో వాయిదా పడింది. తాజాగా రిలీజైన ప్రోమోలో ఎవరు మీలో కోటీశ్వరులు టైమింగ్స్ కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు.
ఆగష్టు 22వ తేదీన కర్టెన్ రైజర్ ప్రసారం కానుండగా సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 గంటలకు ఈ షో ప్రసారం కానుందని ఎన్టీఆర్ ప్రోమోలో వెల్లడించారు. అయితే గత కొంతకాలం నుంచి ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో, బిగ్ బాస్ షో సీజన్ 5 ఒకే సమయంలో ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. తెలుగు బిగ్ బాస్ షో వీక్ డేస్ లో రాత్రి 9.30 గంటలకు వీకెండ్ లో 9 గంటలకు ప్రసారమవుతుంది.

ఎవరు మీలో కోటీశ్వరులు, బిగ్ బాస్ రెండు షోలు భారీ బడ్జెట్ షోలు కావడంతో ఒకే సమయంలో ప్రసారమైతే రెండు షోలు రేటింగ్ విషయంలో నష్టపోవాల్సి ఉంటుంది. ఎన్టీఆర్, ఎవరు మీలో కోటీశ్వరులు షో నిర్వాహకులు బిగ్ బాస్ షోతో పోటీ పడకుండా టైమింగ్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఇదే అసలు కారణమని సమాచారం. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బిగ్ బాస్ షో సీజన్ 5 సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుందని వార్తలు వస్తుండటం గమనార్హం.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!
















