యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ ఇష్టమే. తారక్ కూడా తన ఫ్యాన్స్ ని కుటుంబ సభ్యుల్లా చూస్తుంటారు. ఎంతోమంది అభిమానుల ఇంటికి స్వయంగా వెళ్లి కలిసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా ఫ్యాన్స్ అంటే ఎన్టీఆర్ కి ఎంత ప్రాణమో తెలిపిన అరుదైన సంఘటన రీసెంట్ గా ఒకటి జరిగింది. ‘జై లవ కుశ’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు, పలువురు డైరెక్టర్లు, సినీ ప్రముఖులు, అభిమానులు తరలి వచ్చారు. ఈ ఈవెంట్ జరుగుతుండగా ఓ అభిమాని ఎన్టీఆర్ దగ్గరకు వచ్చాడు.
అందరూ షాక్ లో ఉండగా, బౌన్సర్లు అభిమానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ తారక్ బౌన్సర్లను ఆగమని చెప్పి… అభిమానిని హగ్ చేసుకున్నారు. తన హీరోకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని వచ్చిన అతను.. ఎన్టీఆర్ హత్తుకోగానే ఆనందపడ్డాడు. జరిగిందంతా ప్రత్యక్షంగా చూసిన ఫ్యాన్స్ ఆనందించారు. ఈ దృశ్యాన్ని టీవీలో చూస్తున్నవారు కూడా తారక్ పై మరింత అభిమానం పెంచుకున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.