ఎన్టీఆర్ – త్రివిక్రమ్… స్టోరీ లైన్ అదేనా..?

‘అల వైకుంఠపురములో’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయినప్పటికీ… సంక్రాంతి విన్నర్… తెలుగు రాష్ట్రాల్లో నాన్- బాహుబలి రికార్డులని సొంతం చేసుకున్నప్పటికీ.. కథ విషయంలో మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ పై అనేక సెటైర్లు పడ్డాయి. ‘అత్తారింటికి దారేది’ నుండీ ఓకే స్టోరీ లైన్ అటు తిప్పి.. ఇటు తిప్పి తీస్తున్నాడు’ అని..! ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కూడా అదే తరహా కథతో తీస్తాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాకి.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ స్టోరీ లైన్ వాడేస్తున్నాడు త్రివిక్రమ్ అంటూ ఇప్పుడు ప్రచారం జోరందుకుంది.

ఆ చిత్రంలో పొలిటిషియన్ అయిన మామ గారిని అల్లుడు గుణపాఠం చెబుతాడు. బాపుగారు డైరెక్ట్ చేసిన ఆ చిత్రం ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంటుంది. ఇదే లైన్ తీసుకుని ఇప్పటి ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడని సమాచారం. మధ్యలో కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఉంటుందని.. ఎంతో సున్నితంగా పొలిటికల్ పార్టీల పై సెటైర్లు కూడా ఉంటాయని తెలుస్తుంది. అయితే అలాంటిదేమీ లేదు అని త్రివిక్రమ్ సన్నహితులు అంటున్నారు.’ ‘అజ్ఞాతవాసి’ విషయంలో ఓ ఫ్రెంచ్ మూవీని కాపీ కొట్టి దొరికేసిన త్రివిక్రమ్.. ఆ తర్వాత పాత సినిమాలలోని లైన్ లను తీసుకుని.. ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఎంటర్టైనింగ్ గా తీసేస్తున్నాడు’ అని కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి చివరికి ఏం చేస్తాడో చూడాలి.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus