సినిమా రిలీజ్ విషయంలో హీరోలు, నిర్మాతల మధ్య పోటీ వాతావరణం అనేది కామన్.. పండుగల సీజన్స్‌లో అయితే ఆ హంగామా మామూలుగా ఉండదు.. ఇక అభిమానుల మధ్య ఘర్షణలు, థియేటర్ల కోసం పోటీ.. ఆ సందడే వేరుగా ఉంటుంది.. పెద్ద హీరోల దగ్గరి నుండి ఆ తర్వాత జెనరేషన్ హీరోలు కూడా పండుగ సందర్బాలలో పలుసార్లు పోటీ పడిన సంఘటనలు జరిగాయి.. ఈ ఏడాది చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ తో తలపడ్డారు..
రెండు చిత్రాలు అద్భుతమైన విజయం సాధించాయి.. ఇక దసరాకి రామ్, రవితేజ, దళపతి విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వార్ ఫిక్స్ చేసుకున్నాయి.. అప్పటికి బాలయ్య NBK 108, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ కూడా వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.. దసరాకే ఇలా ఉంటే.. 2024 సంక్రాంతికి మామూలు పోటీ లేదు.. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ – K’ జనవరి 12 లాక్ చేసుకుంది.. రీసెంట్‌గా మహేష్ బాబు – త్రివిక్రమ్‌ల SSMB 28 జనవరి 13 అని అనౌన్స్ చేశారు..
రామ్ చరణ్ – శంకర్‌ల ‘గేమ్ ఛేంజర్’ కూడా సంక్రాంతికే అంటున్నారు.. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రభాస్ (Prabhas) – మహేష్ బాబు ఎన్నిసార్లు తమ సినిమాలతో పోటీ పడ్డారు అనే విషయం ఆసక్తికరంగా మారింది.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
నాని – అడవి రాముడు..
‘నాని’ 2004 మే 14న విడుదల కాగా ‘అడవి రాముడు’ 2004 మే 21న రిలీజ్ అయింది.. (వారం గ్యాప్)
పౌర్ణమి – పోకిరి..
‘పౌర్ణమి’ 2006 ఏప్రిల్ 1, ‘పోకిరి’ 2006 ఏప్రిల్ 28న వచ్చాయి.. (నాలుగు వారాల గ్యాప్ – 27 రోజులు)
ప్రాజెక్ట్ – K – SSMB 28..
‘ప్రాజెక్ట్ – K’ 2024 జనవరి 12, SSMB 28 జనవరి 13 2024న ప్రేక్షకుల ముందుకు రానున్నాను..
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?