తరుణ్, రిచా హీరో హీరోయిన్లుగా రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘నువ్వే కావాలి’. విజయ భాస్కర్.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్’ పై రామోజీరావు నిర్మించారు. ఇప్పటి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటల రచయితగా పనిచేశారు. 1999లో వచ్చిన ‘నీరం’ అనే మలయాళ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది ‘నువ్వే కావాలి’ చిత్రం.
Nuvve Kavali Collections
కేవలం రూ.1.5 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా 2000 అక్టోబర్ 13న ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.కోటి సంగీతం ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అందుకే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నేటితో ‘నువ్వే కావాలి’ రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది.
ఈ సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
7.35 cr
సీడెడ్
2.80 cr
ఉత్తరాంధ్ర
1.79 cr
ఈస్ట్
1.43 cr
వెస్ట్
1.27 cr
గుంటూరు
1.56 cr
కృష్ణా
1.33 cr
నెల్లూరు
0.86 cr
ఏపీ+తెలంగాణ టోటల్
18.39 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.81 cr
టోటల్ వరల్డ్ వైడ్
19.20 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్)
‘నువ్వే కావాలి’ చిత్రం రూ.1.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా రూ.19.20 కోట్లు షేర్ ను రాబట్టింది. అప్పటివరకు ఇండస్ట్రీ హిట్ గా కొనసాగుతున్న ‘కలిసుందాం రా’ కలెక్షన్లను అధిగమించి ‘నువ్వేకావాలి’ నెంబర్ 1 ప్లేస్ ను దక్కించుకుంది. బయ్యర్స్ కి దాదాపు రూ.18 కోట్ల పైనే లాభాలు అందించింది. డెబ్యూ హీరోల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో తరుణ్ రేంజ్ ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయింది.