Samantha: ‘ఉ అంటావా.. ఉఊ అంటావా’ సాంగ్ మేకింగ్ వీడియో వైరల్..!

‘పుష్ప’ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ లో నర్తించిన సంగతి తెలిసిందే. ఆ పాట ఇండియా మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. ‘ఉ అంటావా.. ఉఊ అంటావా’ అంటూ సాగే ఈ పాటతో 2021 కి అందరిలో ఎనర్జీని నింపి మరీ గుడ్ బై చెప్పాడు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. ఇప్పకీ టాప్ లో ట్రెండ్ అవుతూ అందరితో స్టెప్పులు వేయిస్తుంది ఈ పాట. అయితే మొదట దీని లిరికల్ రిలీజ్ అయినప్పుడు ఎన్నో వివాదాలు తలెత్తాయి.

టిపాట ట్యూన్ కాపీ అంటూ కొందరు.. పురుషుల మనోభావాల్ని కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయంటూ మరికొందరు ఈ పాట పై విమర్శలు గుప్పించారు. సినిమాలో కూడా ఈ పాట మేకింగ్ బాలేదని.. అసలు లైటింగ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా అందరూ చీకట్లోనే చిందులు వేశారని.. క్రిటిక్స్ కూడా సెటైర్లు వేశారు. అయితే ఇవన్నీ ఆ పాటని మరింత పాపులర్ చేయడానికి ఉపయోగపడ్డాయి తప్ప దాన్ని రేంజ్ ను తగ్గించలేకపోయాయి. దేవి శ్రీ ప్రసాద్ అన్నట్టు దీనిని ఓ భక్తి గీతంలా రోజు విని ఎంజాయ్ చేసే బ్యాచ్ చాలా మంది ఉన్నారు.

ఈ పాటకి సమంత స్టయిల్లో కవర్ సాంగ్స్ చేసిన భామలు కూడా చాలా మందే ఉన్నారు. అందులో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి కూడా ఒకరు. ఇదిలా ఉండగా… .. ‘ఉ అంటావా.. ఉఊ అంటావా’ పాటకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత. చమటలు చిందించి మరీ ‘ఉ అంటావా.. ఉఊ అంటావా’ పాటకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది సమంత.ఆమె హార్డ్ వర్క్ కి నిజంగా మెచ్చుకోవాల్సిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus