‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) సినిమాకు సీక్వెల్ గా ‘ఓదెల 2’ (Odela 2) రూపొందిన సంగతి తెలిసిందే. తమన్నా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాను అశోక్ తేజ (Ashok Teja) డైరెక్ట్ చేయగా… స్టార్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) ఓ నిర్మాతగా అలాగే దర్శకత్వ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాని సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్లు ప్రచారం జరిగింది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఏక కాలంలో ఈ సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘ఓదెల 2’ థియేట్రికల్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.00 cr |
సీడెడ్ | 1.00 cr |
ఆంధ్ర | 3.00 cr |
ఏపీ + ఆంధ్ర (టోటల్) | 7.00 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.50 cr |
హిందీ | 0.50 cr |
ఓవర్సీస్ | 0.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 9.50 cr |
‘ఓదెల 2’ చిత్రానికి రూ.9.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకే బిజినెస్ ఈ రేంజ్లో జరిగింది. టాక్ కనుక పాజిటివ్ గా వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.