SSMB 28: త్రివిక్రమ్ జెట్ స్పీడ్ ప్లాన్.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమాపై మొత్తానికి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. గత రెండు రోజుల నుంచి సినిమా అప్డేట్ కు సంబంధించిన రూమర్స్ అభిమానులను కన్ఫ్యూజన్ కు గురి చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ళ తరువాత కలుస్తున్న కాంబో కాబట్టి అభిమానుల్లో అంచనాల డోస్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. గత రాత్రి నుంచి ఈ కాంబోపై ఎన్నో రకాల హ్యాష్ ట్యాగ్స్ కూడా వైరల్ అయ్యాయి.

మొత్తానికి అనుకున్నట్లుగానే హారిక హాసిని క్రియేషన్స్ లో సినిమా సెట్టయినట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఒక స్పెషల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో విడుదల చేసిన అప్డేట్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. థమన్ మరొకసారి మ్యూజిక్ తో అదరగొట్టేసాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేసి 2022 సమ్మర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ సినిమా షూటింగ్ తో పాటు త్రివిక్రమ్ సినిమాను కూడా ఒకేసారి ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నాడు. అనంతరం రాజమౌళి కోసం రెడీ కానున్నట్లు తెలుస్తోంది.


ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus