పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘ఓజి’ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. నిన్న రాత్రి నుండే ప్రీమియర్ షోలు పడ్డాయి. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. తొలి రోజు ఈ సినిమా ట్రాక్ చేసిన అన్ని ఏరియాల్లోనూ 90 శాతం పైనే ఆక్యుపెన్సీలు రిజిస్టర్ చేసింది.
వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితులను లెక్క చేయకుండా ఆడియన్స్ ఈ సినిమాని చూసేందుకు ఎగబడుతున్నారు. సో మొత్తంగా తొలిరోజు ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. టికెట్ రేట్ల హైక్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల బాక్సాఫీస్ కళకళలాడిపోతోంది అనే చెప్పాలి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఓజి’ సినిమా తొలి రోజు ఏకంగా రూ.90 కోట్లు షేర్ సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. గ్రాస్ పరంగా రూ.165 కోట్ల వరకు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇప్పటివరకు రూ.100 కోట్ల షేర్ మూవీ లేదు. ఈ కారణంతో పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేసే నెటిజన్లు ఎక్కువ మందే ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ ‘ఓజి’ ఓపెనింగ్స్ గట్టి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. ‘ఓజి’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాలి. తొలి రోజే సగం టార్గెట్ రీచ్ అయిపోవడం గ్యారెంటీగా కనిపిస్తుంది. ఇక లాంగ్ వీకెండ్ హెల్ప్ తో కచ్చితంగా.. సోమవారం లోపే బ్రేక్ ఈవెన్ కూడా పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.