‘ఓజి’ సినిమా భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అయితే నిన్న ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. సోషల్ మీడియాలో సినిమా చూసిన వాళ్ళు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే ‘ఓజి’ లో కొన్ని కీలక ప్లస్ పాయింట్స్, అలాగే మైనస్ పాయింట్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా ప్లస్ పాయింట్స్
1) ‘ఓజి’ కాన్సర్ట్ లో పవన్ కళ్యాణ్ జపనీస్ లో డైలాగులు చెబితే… ‘సినిమాకి జపనీస్ బ్యాక్ డ్రాప్ ఎందుకు పెట్టారు?’ అనే డౌట్ చాలా మందికి వచ్చింది. దానికి సినిమాలో ఇచ్చిన కన్క్లూజన్ బాగుంది. ఓపెనింగ్ సీన్లోనే ఆ డౌట్ కి క్లారిఫికేషన్ ఇచ్చేసి.. వెంటనే అటెన్షన్ డ్రా చేశాడు దర్శకుడు సుజిత్. ఇదొక ప్లస్ పాయింట్.
2) టైటిల్ కార్డ్స్ చాలా బాగున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి టైటిల్ కార్డ్స్ పడలేదు. సినిమాలో ఏ టైంలో ఎలాంటి సీన్ వస్తుంది అనే క్లారిటీ కూడా టైటిల్ కార్డ్స్ లో క్లారిటీ ఇచ్చేశారు.
3) పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్.. దానికి ఎక్కువ బిల్డప్ ఇవ్వకుండా మాటలతో చేసిన మ్యాజిక్ బాగుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రో సీన్ ను దర్శకుడు సుజిత్ చాలా బాగా డిజైన్ చేశాడు. టెక్నికల్ టీం బ్రిలియన్స్ కూడా ఈ సీన్లో కనిపిస్తుంది.
4) పోర్ట్ సీన్ వద్ద శ్రీయ రెడ్డి పాత్రకు కూడా మంచి ఎలివేషన్ ఇచ్చారు. అభిమన్యు సింగ్ తో ఆమె పలికే డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. పెద్ద సినిమాల్లో లేడీస్ కి కూడా ఇలాంటి హై మూమెంట్స్ ఉంటే.. సినిమా రేంజ్ ఇంకా పెరుగుతుంది. ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా సంతృప్తిగా ఫీల్ అవుతారు. సో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కావచ్చు, అప్ కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు.. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తే ఇలాంటి సన్నివేశాలు రాసుకుంటే చాలా బాగుంటుంది.
5) ఇంటర్వెల్ బ్లాక్ ‘ది బెస్ట్’ అనలేం కానీ… ఫ్యాన్స్ కి అమితంగా నచ్చుద్ది. ఈ సీన్ ను ఓ ఫ్యాన్ బాయ్ లా మారిపోయి సుజిత్ డైరెక్ట్ చేసి ఉండొచ్చు.
6)సెకండాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ కూడా క్రేజీగా డిజైన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సన్నివేశాల్లో ఇది కూడా ఒకటి.
7) తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కొన్ని ల్యాగ్ సీన్స్ ని కూడా తన బీజీఎంతో మేనేజ్ చేశాడు.
మైనస్ పాయింట్స్
ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకుందాం. అయితే దానికంటే ముందు ‘ఓజి’ విషయంలో ఏదైతే ప్లస్ పాయింట్స్ అని చెప్పుకుంటామో.. దానికి ‘కానీ’ అనేది యాడ్ చేసుకుని మైనస్ పాయింట్స్ కూడా చెప్పుకునేలా దర్శకుడు సుజిత్ బ్యాలెన్స్ తప్పాడు.
8) ముందుగా ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ట్రాక్ చాలా వీక్ గా ఉంది.(కాన్సర్ట్ లో పవన్ కళ్యాణ్ ‘హీరోయిన్ ట్రాక్ చిన్నది’ అని లీక్ చేశాడు కాబట్టి.. స్పాయిలర్ అనిపించుకోదు) హీరోయిన్ చనిపోయే సీన్లో ఆడియన్స్ కానీ, ఫ్యాన్స్ కానీ ఆ ఎమోషన్ ఫీల్ అవ్వరు. ‘హమ్మయ్య.. ఇక పవన్ కళ్యాణ్ విజృంభిస్తాడు అనుకుంటారు. అంటే ఎంత వీక్ గా ఉంటుందో ఆ ట్రాక్ మీరే అర్థం చేసుకోండి.
అంతేకాదు హీరోయిన్ ట్రాక్ ప్రజెంట్ లో జరుగుతుందో.. పాస్ట్ లో జరిగిందో కూడా అర్థంకాని విధంగా దర్శకుడు కన్ఫ్యూజ్ చేశాడు.
9) ఎలివేషన్ సీన్స్ మనం ప్లస్ అని చెప్పుకుంటాం.. కానీ కథలో డెప్త్ లేకుండా అవి ఎక్కువగా వచ్చి వెళ్తే ఎంజాయ్ చేసేలా ఉండవు కదా. ‘ఓజి’ లో అదే జరిగింది. ‘భాషా’ ‘కె.జి.ఎఫ్’ సినిమాల్లో హీరోల్లా… మన హీరోని కూడా చేసుకోవాలి అని భావించి కథ, కథనాల పై ఫోకస్ పెట్టకుండా ఎలివేషన్స్ పైనే దర్శకుడు ఫోకస్ పెట్టాడేమో అనుకోవాలి.
10) మొత్తంగా సెకండాఫ్ పోలీస్ స్టేషన్ సీన్ తర్వాత సినిమా మొత్తం తేలిపోయింది. అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ అయితే గందరగోళానికి గురి చేస్తుంది.