Pawan Kalyan: ఓజీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏడాది వెయిట్ చేయాల్సిందేనా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఫ్యాన్స్ ను చూస్తే బాధపడాలో, ఆనందపడాలో అర్థం కాదు. ఎందుకంటే.. పాలిటిక్స్ లో సూపర్ ఫామ్ లో ఉన్నందుకు ఆనందపడుతూనే, సినిమాల యాక్టివిటీ తగ్గిపోయి.. తదుపరి సినిమా ఎప్పుడొస్తుందో తెలియక బాధపడుతూ ఉంటారు. పవన్ అభిమానులందరూ ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ఎకైక సినిమా “ఓజీ” (OG Movie). సుజీత్ (Sujeeth) డైరెక్షన్, విడుదలైన టీజర్ సినిమా మీద అంచనాలను రెట్టింపు చేశాయి. కానీ.. తర్వాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ అయిపోవడం, ఇప్పుడు ఏకంగా రిప్యూటీ సీయం అయిపోవడంతో సినిమాలకు టైమ్ ఇవ్వలేకపోతున్నాడు.

Pawan Kalyan

ఇటీవల “హరిహర వీరమల్లు” (Hari Hara Veera Mallu) కోసం డేట్స్ ఇచ్చినప్పటికీ.. అది కూడా సజావుగా సాగడం లేదు. ఆ సినిమా మార్చి 28, 2025 విడుదల చేస్తునట్లుగా ప్రకటించినప్పటికీ.. పవన్ కళ్యాణ్ అభిమానుల చూపు మాత్రం “ఓజీ” మీదే ఉండి. అయితే.. ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ దాదాపు 30 రోజుల డేట్స్ ఇవ్వాలని, అది కూడా సింగిల్ షెడ్యూల్ అని సమాచారం.

ప్రస్తుతం ఆంధ్ర రాజకీయల విషయంలో జరుగుతున్న రచ్చలు, మారుతున్న సమీకరణలు దృష్టిలో పెట్టుకుని “ఓజీ”కి డేట్స్ ఇవ్వడం ఇప్పట్లో అయ్యే పని కాదు అని అర్థమవుతుంది. అయితే.. సుజీత్ & దానయ్య (D. V. V. Danayya) మాత్రం వచ్చే ఏడాది దసరాకి సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ “ఓజీ” కోసం మరో ఏడాది వెయిట్ చేయాల్సిందే అన్నమాట. ఇకపోతే..

పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలు సైన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అవుట్ డోర్ లొకేషన్ షూట్స్ & సాంగ్స్ లేకుండా ఒక చిన్న కాన్సెప్ట్ సినిమా చేయాలని చూస్తున్నాడట. ఆ మేరకు తన నిర్మాతలకు సందేశం పంపాడట. మరి పవన్ ను రీమేక్ కథతో కాకుండా ఒరిజినల్ స్టోరీతో ఎవరు ఇంప్రెస్ చేస్తారో చూడాలి.

దేవర విషయంలో ఫ్యాన్స్ ఆశ ఇదే.. ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus