అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేవారు దర్శకరత్న దాసరి నారాయణ రావు. ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో సమస్యలను ఆయన పరిష్కరించేవారు. టైటిల్ వివాదాలైతేనేమి.. రిలీజ్ డేట్ క్లాష్ ల విషయంలో అయితేనేమి.. ఇలా అన్ని విషయాల్లోనూ ఆయన పెద్ద దిక్కుగా ఉండి నడిపించారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి దక్కాల్సిన పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి గౌరవ ప్రధమైన అవార్డుల విషయాల్లో కూడా.. దాసరి తన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించి పనులు జరిపించేవారట. అయితే ఆయన ఈ లోకాన్ని విడిచిపోయినప్పటి నుండీ ఆయన స్థానంలోకి మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. అప్పుడు దాసరికి ఇచ్చిన గౌరవ మర్యాధలు అన్నీ ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవికి దక్కుతున్నాయి.
పిలవాలే కానీ ప్రతీ సినిమా వేడుకకి హాజరవుతున్నారు. ఇటీవల లాక్ డౌన్ కారణంగా ‘సిసిసి’ ని స్థాపించి విరాళాలు సేకరించి పేద కళాకారులను ఆదుకున్నారు. ఇప్పుడు ఆగిపోయిన షూటింగ్ ల విషయంలోనూ అలాగే సినీ ఇండస్ట్రీ భవిష్యత్తు కు సంబంధించిన విషయాల్లో కూడా మెగాస్టార్.. మంత్రి తలసానితో మీటింగ్ లు పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే ఈ విషయంలో తప్పు పట్టేవారు కూడా లేకపోలేదు అంటూ మొన్నటికి మొన్న నాగబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మరోసారి నాగబాబు.. చిరంజీవిని అలాగే ఇండస్ట్రీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నాగబాబు మాట్లాడుతూ.. “మా అన్నయ్య ఇండ్రస్ట్రీకి పెదరాయుడేమీ కాదు. కానీ.. ఈ మధ్య ఇండ్రస్ట్రీకి ఏ సమస్య వచ్చినా చురుగ్గా ముందుండి పరిష్కరిస్తున్నాడు. అలాంటి వ్యక్తి మన సినీ ఇండస్ట్రీకి కావాలి.
ఇండ్రస్ట్రీ ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఇక్కడ బాస్‌లు అంటూ ఎవరూ లేరు. ఎవరైనా సరే, పెద్ద మనిషిగా వ్యవహరించి, బాధ్యతలు పంచుకోవచ్చు.అప్పట్లో దాసరి గారు పెద్ద మనిషిగా బాధ్యతల్ని తన పై వేసుకున్నారు. ఆయనకు ఓపిక, సహనం చాలా ఎక్కువ. ఆయన తరవాత.. మా అన్నయ్య ముందుకొచ్చి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఎవరో ఒకరు సమస్యల్ని సర్దుబాటు చేయడానికి ముందుకు రావాలి. అది నాగార్జున కావొచ్చు, కృష్ణగారి కుటుంబం కావొచ్చు, నందమూరి కుటుంబం కావొచ్చు. అందరూ తలో చెయ్యి వేస్తే మంచిదే కదా.! ఇండ్రస్ట్రీ అంటే నాలుగు కుటుంబాలది కాదు. ఎవరైనా రావొచ్చు… ఎదగొచ్చు. అప్పట్లో అన్నయ్య అలా వచ్చి ఎదిగిన వారే. ఇప్పుడు రవితేజ, విజయ్ దేవరకొండ.. కూడా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగారు. సత్తా ఉన్నవాళ్లంతా ఎదిగారు. లేనివాళ్లు నిలబడలేదు. అంతే తేడా” అంటూ చెప్పుకొచ్చాడు.