ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో ఎవరికీ తెలియనట్లే.. అఖిల్ అక్కినేని బాబు హిట్ ఎప్పుడు కొడతాడో కూడా ఎవరికీ అంతుబట్టని విషయం. “అఖిల్” మొదలుకొని “మిస్టర్ మజ్ను” వరకు ప్రతి సినిమాతో “ఈసారి అఖిల్ కొడతాడు” అని నాగార్జున ఫిక్స్ అవ్వడం.. అఖిల్ హిట్ కి బదులుగా ఫ్లాప్ ను కొట్టడం షరా మామూలే అయిపోయింది. అఖిల్ కి లాంచ్ లు, రీలాంచ్ లు అన్నీ అయిపోయాయి. ఇక రీసెంట్ గా ఎనౌన్స్ చేసిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్”ను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుండడం, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నప్పటికీ.. ఎందుకనో ఈ ప్రొజెక్ట్ మీద జనాలకి పెద్దగా ఆసక్తి కలగడం లేదు.
పైగా.. ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం మేరకు ఇప్పుడు ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ దగ్గర నాగార్జున కుర్చీ వేసుకొని కూర్చుంటున్నాడంట. గీతా ఆర్ట్స్ మీద నమ్మకం ఉన్నప్పటికీ.. బొమ్మరిల్లు భాస్కర్ ట్రాక్ రికార్డ్ మీద భయంతోనే నాగార్జున ఈ రిస్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే.. నాగార్జున తన పర్సనల్ కెరీర్ విషయంలోనే ఈమధ్యకాలంలో అంతగా సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. మరి ఇలాంటి తరుణంలో కొడుకు కెరీర్ విషయంలో వేళ్ళు పెట్టడం అవసరమా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అఖిల్ మునుపటి చిత్రాలు “హలో, మిస్టర్ మజ్ను” విషయాల్లోనూ నాగార్జున ఇన్వాల్వ్ అయిన విషయం తెలిసిందే.