ఆస్కార్ ముచ్చట తీర్చుకుందామని ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు మరోసారి నిరాశ ఎదురైంది. గతంలో మూడు సార్లు నామినేషన్ గౌరవాన్ని పొందిన భారతీయ సినిమా… ఈ సారి ఆ గౌరవానికి కూడా నోచుకోలేకపోయింది. ఆస్కార్ నామినేషన్ ఆశల్ని చిగురించిన ‘జై భీమ్’ నామినేషన్ జాబితాలో నిలబడలేకపోయింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో నామినేషన్స్ కోసం మన దేశం నుండి రెండు సినిమాలు నిలిచాయి. కానీ ఆఖరి జాబితాలో ఉండలేకపోయాయి.
ఆస్కార్ నామినేషన్స్ వివరాలను అకాడెమీ అవార్డ్స్ టీమ్ ఇటీవల వెలువరించింది. అందులో మన సినిమాలకు చోటు దక్కలేదు. ఆస్కార్ నామినేషన్స్ కోసం ఈMarakkar సారి బరిలో ఉన్న సూర్య ‘జై భీమ్’, మోహన్‌లాల్ ‘మరక్కర్’ నిలిచాయి. మొత్తంగా జాబితాను ఆఖరి మారు పరిశీలించిన నామినేషన్స్ టీమ్ పక్కన పెట్టిన సినిమాల లిస్ట్‌లో ఈ రెండు సినిమాలూ ఉన్నాయి. నిజానికి మంగళవారం ఉదయం నుండి సోషల్ మీడియాలో ‘జై భీమ్’ పేరు మారుమోగిపోయింది.
హాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తి ‘జైభీమ్’ ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్‌లో ఉండొచ్చు అనే ట్వీట్ చేయడంతో ఈ చర్చ మొదలైంది. దీంతో మంగళవారం సాయంత్రం ఆస్కార్ శుభవార్త వినొచ్చు అని అభిమానులు అంతా ఎదురుచూశారు. కానీ అసలు లిస్ట్‌లో ‘జైభీమ్’ పేరు లేకుండా పోయింది. దీంతో ‘జై భీమ్’ టీమ్ తో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల్లో నిరాశ కనిపించింది. అది సోషల్ మీడియాలో ప్రస్ఫుటంగా కనిపించింది. మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగబోతోంది. మరోవైపు ‘మరక్కర్’ విషయంలో పెద్దగా అంచనాలు కనిపించలేదు.
ఇక ఇప్పటివరకు మన దేశం నుండి ఆస్కార్ కోసం మూడు సినిమాలు మాత్రమే రేసులో నిలిచాయి. ‘మదర్ ఇండియా’ (1957), ‘సలామ్ బాంబే’ (1988), ‘లగాన్’ (2001) మాత్రమే నామినేషన్స్‌లో నిలిచాయి. మిగిలిన అన్నిసార్లూ నామినేషన్ గౌరవం కూడా పొందలేకపోయాయి. ఈసారైనా ఆ ముచ్చట తీర్చుకుందాం అంటే నిరాశే ఎదురైంది. దీంతో వచ్చే ఏడాది గురించి మళ్లీ వెయిట్ చేయాల్సిందే.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!