బిగ్ బాస్ హౌస్ లో ఈవారం నామినేషన్స్ మజాని ఇచ్చాయి. ఫస్ట్ కెప్టెన్ అయిన అనీమాస్టర్ నలుగురుని నామినేట్ చేసి జైలుకి పంపింది. ఆ జైల్లో ఉన్న వారిని ఇంటిసభ్యులు ఒక్కొక్కరిని రీలీజ్ చేస్తూ నామినేషన్స్ ని కొనసాగించాలి. ఇక్కడే ఒక్కొక్కరు గేమ్ స్ట్రాటజీలని వాడారు. ముఖ్యంగా జెస్సీ, శ్రీరామ్, ఇంకా రవిలు ఉన్నప్పుడు ఎవర్ని రిలీజ్ చేయాలి. ఎవరు నామినేట్ అవుతారు. మళ్లీ తిరిగి బజర్ రాకపోతే ఏం చేయాలి అనే లెక్కలు వేస్కున్నారు. ముఖ్యంగా రవి శ్రీరామ్ ని అలాగే జెస్సీని ఇన్ఫులెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. సంకెళ్లు తీస్కుని గేమ్ ఆడే ప్రయత్నంలో వారి బుర్రలో ఆలోచలను మెదిలేలా చేశాడు.
ఎవర్ని రిలీజ్ చేస్తావ్.. ఎవరు రీలీజ్ అయితే వాళ్లు ఎవర్ని నామినేట్ చేస్తారు. మళ్లీ మనం జైల్లోకి వెళ్లాల్సి ఉంటుందనే లెక్కలు వేశాడు. నిజానికి జైల్లో ఉన్న కాజల్ ని విడుదల చేయాలని ముందుగానే అనుకున్నారు. కానీ, కాజల్ బయటకి వస్తే రవిని నామినేట్ చేస్తుందని ఊహించాడు. ఊహించినట్లుగానే రవిని నామినేట్ చేసింది. కాజల్. ఇక లాస్ట్ లో శ్రీరామ్ తప్ప వేరే ఆప్షన్ కాజల్ దగ్గర లేదు. బయట కేవలం పింకీ మాత్రమే ఉంది. దీంతో ఎటూ తేల్చుకోలేని కాజల్ రవిని, శ్రీరామ్ ని సెలక్ట్ చేయాలి అన్నప్పుడు రవిని నామినేట్ చేసింది.
నిజానికి శ్రీరామ్ కాజల్ తో సిరిని జైల్ నుంచీ రిలీజ్ చేయామని చెప్పాడు. కానీ, కాజల్ షణ్ముక్ ని విడుదల చేసింది. దీంతో లాస్ట్ లో షణ్ముక్ నామినేషన్స్ నుంచీ సేఫ్ అయ్యాడు. ఇన్ని లెక్కలు వేసిన రవి లాస్ట్ మినిట్ లో జైలుపాలై నామినేషన్స్ లో మిగిలాడు. లెక్క తప్పిన రవికి తిక్క వచ్చింది. దీంతో నామినేషన్స్ గురించి డిస్కషన్స్ మొదలుపెట్టాడు. మరి ఇది ఎంతవరకూ దారితీస్తుందనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి. అదీ మేటర్.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!