‘నెపోటిజం’ పై రేణు దేశాయ్ కామెంట్స్..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య.. దేశం మొత్తాన్ని కుదిపేసింది. బాలీవుడ్ లో ‘నెపోటిజం’ పాతుకుపోయింది.. సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేక పోతే తోక్కేస్తున్నారు’ అంటూ నెటిజన్లు ఓరేంజ్లో అక్కడి స్టార్ క్యాస్ట్ ను అలాగే స్టార్ ప్రొడ్యూసర్స్ ను ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం పై ఎంతో మంది సెలబ్రిటీలు స్పందించారు.. ఇంకా స్పందిస్తూనే ఉంటున్నారు. ఈ లిస్ట్ లో రేణు దేశాయ్ కూడా చేరింది. సుశాంత్ గురించి అలాగే నెపోటిజం గురించి ఆమె చెప్పుకొచ్చింది.

రేణు దేశాయ్ మాట్లాడుతూ.. “సుశాంత్ సింగ్ చాలా సెన్సిటివ్ అనుకుంట. ఇలాంటి వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సుశాంత్ ఇప్పుడు సక్సెస్ లోనే ఉన్నాడు. స్టార్ అయ్యాడు కూడా.! కానీ ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. అందరూ ‘నెపోటిజం వల్లనే సుశాంత్ డిప్రెషన్ కు వెళ్లిపోయాడు.. అందుకే సూసైడ్ చేసుకున్నాడు’ అని అంటున్నారు. నిజమే ఇండస్ట్రీలో నెపోటిజం ఉంది. ఇందులో దాచడానికేమి లేదు. అయితే నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే.. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి కాకుండా.. కేవలం ట్యాలెంట్ ఉంది కదా అని ఇండస్ట్రీకి వచ్చేస్తే సరిపోదు. ట్యాలెంట్ తో పాటు మనోధైర్యం కూడా ఉండాలి. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఇక్కడ నిలదొక్కుకోవాలి అంటే ఎంతో మానసిక ధైర్యం అవసరం” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus