ఫిలిం ఇండస్ట్రీలో ఓ సినిమా సూపర్ హిట్ అయితే.. ఆ హీరో – డైరెక్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతుంటుంది.. క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ కూడా కాంబోలో మళ్లీ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు.. కథానాయకులు, దర్శకులు కూడా మంచి కథ దొరికితే కలిసి సినిమా చేస్తాం అని చెప్తుంటారు.. ఫ్యాన్స్ కూడా ఆ కాంబోలో సినిమా అంటే హిట్ అని ఫిక్స్ అయిపోతుంటారు.. అలా మంచి కథ సెట్ అవడంతో దాదాపు పదేళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత మళ్లీ రిపీట్ అవుతున్న క్రేజీ కాంబినేషన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..
మహేష్ – త్రివిక్రమ్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ రైటర్ కమ్ డైైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతడు’ ఎవర్ గ్రీన్ కామెడీ, ఫ్యామిలీ ఫిలిం.. తర్వాత వచ్చిన ‘ఖలేజా’ నిరాశపరచినా.. టీవీలో, యూట్యూబ్‌లో మాత్రం ఆకట్టుకుంటుంది.. దాదాపు 11 ఏళ్ల గ్యాప్ అనంతరం వీరి కలయికలో తెరకెక్కుతున్న మూడో సినిమా సెట్స్ మీద ఉంది..
అల్లు అర్జున్ – సుకుమార్..
రెండో సినిమా ‘ఆర్య’ తో అల్లు అర్జున్‌కి హీరోగా బ్రేక్ ఇచ్చిన సుకుమార్.. తర్వాత ‘ఆర్య 2’ తీశారు.. పదేళ్ల తర్వాత ‘పుష్ప : ది రైజ్’ తో బన్నీని ఐకాన్ స్టార్‌గా మార్చి, పాన్ ఇండియా రేంజ్‌కి తీసుకెళ్లారు.. ఇప్పుడు వీళ్ల కాంబోలో ‘పుష్ప : ది రూల్’ రాబోతుంది..
మంచు విష్ణు – శ్రీను వైట్ల..
శ్రీను వైట్ల సినిమాల్లో ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు.. మంచు విష్ణుని హీరోగా నిలబెట్టడానికి పిల్లర్‌గా నిలిచిన మూవీ ‘ఢీ : కొట్టి చూడు’.. పదిహేనేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది.. వీరి కలయికలో ‘ఢీ’ కి సీక్వెల్ ‘ఢీ : డబుల్ డోస్’ తెరకెక్కనున్నట్లు 2020 నవంబర్‌లో మంచు విష్ణు అనౌన్స్ చేశాడు..
ఆది పినిశెట్టి – అరివళగన్..
ఆది పినిశెట్టి నటించిన హారర్ ఫిలిం ‘ఈరమ్’.. 2011లో ‘వైశాలి’ పేరుతో తెలుగులో కూడా విడుదలై ఘనవిజయం సాధించింది.. అరివళగన్ ఈ చిత్రానికి దర్శకుడు.. 14 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది.. ‘శబ్దం’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో లక్ష్మీ మీనన్ కథానాయికగా నటిస్తోంది..