కరోనా బారిన పడిన ప్రముఖ నటి ఏం చెప్పారంటే..?

కరోనా.. రెండేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా విలయ తాండవం సృష్టించి.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేసిందీ మహమ్మారి.. శవాల గుట్టలు, ఎక్కడిక్కడ స్థంభించిపోయిన జనజీవనం.. అన్ని రకాలుగా కుదేలైపోయిన పలు రంగాలు.. రోగులతో నిండిపోయిన ఆసుపత్రులు.. అబ్బో.. తలుచుకుంటుంటేనే ఒళ్లు గగుర్పొడిచే సంఘటనలు ఎన్నో కళ్లముందు కదలాడుతాయి.. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.. చాలా వరకు కోలుకున్నారు.. వీరిలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు..

కొద్ది కాలంగా నిర్మూలమయినట్లే కనిపించిన కరోనా మళ్లీ మొదలవుతోంది.. కొద్ది రోజులుగా రకరకాల పేర్లతో ఫ్లూలు వస్తున్నాయి.. ఇప్పుడు కొందరికి కోవిడ్ నిర్దారణ అవుతోంది.. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి, పార్లమెంట్ సభ్యురాలు కిరణ్ ఖేర్‌కు మరోసారి కరోనా సోకింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారామె.. వివరాల్లోకి వెళ్తే.. కిరణ్ ఖేర్‌ ఇటీవలే కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.. గతంలోనూ ఆమె ఈ మహమ్మారి బారిన పడ్డారు..

ఈ విషయాన్ని సోమవారం (మార్చి 20) రాత్రి కిరణ్ ఖేర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.. అలాగే ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కూడా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు.. తనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరినీ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చేయమని ఆమె కోరారు.. ప్రస్తుతం చండీగఢ్ ఎంపీగా ఉన్న ఆమెకు 2021లో మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది..

క్యాన్సర్ నుండి కోలుకున్న తర్వాత తిరిగి తన పనుల్లో యాక్టివ్‌గా ఉన్నారామె.. అప్పట్లో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.. అలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడి ఎంతో మందికి ధైర్యాన్నివ్వడమే కాక ఆదర్శంగా నిలిచారు.. అదే సంవత్సరం మార్చిలో దేశంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రచారంలో భాగమైనందుకు కోకిలాబెన్ హాస్పిటల్ నుంచి ప్రశంసలు అందుకున్నారు కిరణ్ ఖేర్.. ఆమె త్వరగా కోలుకోవాలంటూ.. బాలీవుడ్ సినీ, రాజకీయ ప్రముఖులు కామెంట్స్ చేస్తున్నారు..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus