టాలీవుడ్ పెద్దల భేటీ.. బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల కారణంగా మీడియం రేంజ్,పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. టికెట్ రేట్ల తగ్గింపు కూడా ఇందుకో కారణం. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిసి ఈ విషయాల గురించి చర్చించేందుకు ప్రయత్నించారు కానీ అందుకు జగన్ నుండీ అనుమతి లభించలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి మరో ఇద్దరితో భేటీ అయ్యేందుకు జగన్ సానుకూలంగా స్పందించి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని పిలుపునిచ్చారు.

దీంతో ఏ ఏ అంశాల గురించి ప్రధానంగా జగన్ కు విన్నపించుకోవాలనే విషయం పై తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది దర్శకనిర్మాతలు, హీరోలతో చిరంజీవి తన సొంత నివాసంలో మీటింగ్ ఏర్పాటు చేశారు.నాగార్జున,అల్లు అరవింద్,సురేష్ బాబు, వినాయక్,ఆర్.నారాయణ మూర్తి వంటి వారు ఈ మీటింగ్లో పాల్గొనున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ మీటింగ్ కు హాజరుకాలేదు. దీంతో ఆయన అభిమానులు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది కూడా బాలయ్య.. ఈ మీటింగ్ ల పై స్పందించి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనను కావాలనే మీటింగ్ లకు దూరం పెడుతున్నారని ఆయన సీరియస్ అయ్యారు.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుపుతున్నారా అంటూ ఆయన మండిపడ్డ సంగతి తెలిసిందే.మరి ఈసారి ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతుందో..!

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Share.