Varun Tej: సాయి పల్లవి తో మరోసారి రొమాన్స్ చేయనున్న వరుణ్..!

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఫిదా’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. థియేటర్లలో ఈ చిత్రం ఎంత సక్సెస్ అయ్యిందో… బుల్లితెరపై కూడా అదే రేంజ్లో సక్సెస్ సాధించింది. ఈ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా హీరోయిన్ సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు నిజంగానే ‘ఫిదా’ అయిపోయారు. నటనతోనే కాకుండా డ్యాన్స్ తో కూడా సాయి పల్లవి మంచి మార్కులు కొట్టేసింది. ఇక హీరో వరుణ్ కూడా ఈ సినిమాలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు.

హైట్ విషయంలో ఈ జంటకు కొంతమంది పేర్లు పెట్టినా.. స్క్రీన్ పై మాత్రం వరుణ్, సాయి పల్లవి ల జోడి చూడముచ్చటగా ఉండనే చెప్పాలి. మొన్నటికి మొన్న ఓ నెటిజెన్ కూడా ఈ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అని నాగబాబుకి చెప్పడం విశేషం. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. త్వరలోనే ఈ జంట మరోసారి కనువిందు చేయబోతోందట. అవును వీళ్ళిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతోంది అనేది తాజా సమాచారం.

‘ఛలో’ ‘భీష్మ’ వంటి చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించే ఓ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా వరుణ్ తేజ్, సాయి పల్లవి ఎంపికైనట్టు టాక్ నడుస్తుంది. ‘భీష్మ’ తరువాత స్టార్ హీరోలతో సినిమా చెయ్యాలని ప్రయత్నించాడు దర్శకుడు వెంకీ కుడుముల. కానీ ఇప్పట్లో ఎవ్వరూ ఖాళీ లేకపోవడంతో తన మూడో సినిమాని కూడా మీడియం రేంజ్ హీరోతోనే చెయ్యబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus