Vijay,Rashmika: ప్రేమ – పెళ్లి పుకార్లు… మరోసారి క్లారిటీ ఇచ్చిన విజయ్‌!

ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ, ప్రముఖ కథానాయిక రష్మిక మందన… ప్రేమలో ఉన్నారా? స్నేహితులా? రిలేషన్‌లో ఉన్నారా? ఈ డౌట్స్‌ ఇప్పటివి కావు. ఎన్నే ఏళ్లుగా వీళ్ల గురించి పుకార్లు వస్తూనే ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే కొత్త పుకార్లకు ఆస్కారం ఇస్తున్నారు అని చెప్పాలి. తాజాగా మరోసారి ఇలాంటి పుకార్లు ఇంకా చెప్పాలంటే ఏకంగా పెళ్లి పుకార్లే వచ్చాయి. వాటిపై అప్పుడు టీమ్‌ క్లారిటీ ఇవ్వగా… ఇప్పుడు విజయ్‌ క్లారిటీ ఇచ్చాడు.

ఫిబ్రవరిలో విజయ్‌ (Vijay) నిశ్చితార్థం, పెళ్లి అంటూ ఇటీవల పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు / ప్రేయసి అయిన రష్మికను పొట్టి నెలలో మనువాడతాడు అనేది ఆ పుకార్ల సారాంశం. అయితే దీనిపై విజయ్‌ ఎప్పటిలానే ఖండించాడు. పుకార్లలో చెబుతున్నట్టు ఫిబ్రవరిలో నా పెళ్లి జరగడం లేదు. ప్రతి రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లున్నాయి. వాళ్లు నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారు అంటూ సెటైరికల్‌గా మాట్లాడాడు.

ఈ లెక్కన పెళ్లి పుకార్లకు కామా పడ్డట్టే. అదేంటి కామా అనుకుంటున్నారా? ఇటు ఏమీ లేదంటూనే ఇద్దరూ కలసి ట్రిప్పులకెళ్తారు. ఒకే ఇంట్లో ఫొటోలు దిగుతారు. వాటిని విడివిడిగా షేర్‌ చేస్తారు. మామూలుగా సగటు అమ్మాయి, అబ్బాయి కలసి తిరిగితేనే ప్రేమ ఉందేమో / ఉంది అని సమాజం అనుకుంటున్న రోజులివి. ఇలాంటి సమయంలో వయసులో ఉన్న ఇద్దరు సినిమా వాళ్లు తిరిగితే డౌట్స్‌ రాకుండా ఉంటాయా? అవి వార్తలు కాకుండా ఉంటాయా?

అయితే స్నేహితులు కలసి ట్రిప్పులకు వెళ్లకూడదా అంటే కచ్చితంగా వెళ్లొచ్చు. వాటిని ఎవరు ఎలా తీసుకుంటే అలా అన్నట్లు. అయితే ఆ స్నేహితులు ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పి వెళ్తారు. మరి విజయ్‌, రష్మిక చెప్పే వెళ్తున్నారా? అంటే ఆన్సర్‌ అందరికీ తెలిసిందే. అన్నట్లు న్యూ ఇయర్‌ తర్వాత కూడా ఇద్దరూ ట్రిప్పులకు వెళ్లారు. వేర్వేరుగా వెళ్లుంటారేమో కానీ బ్యాగ్రౌండ్స్‌ అయితే ఒక్కలాగే ఉన్నాయి మరి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus