తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డలుగా చరిత్ర ఉన్నంతవరకూ గుర్తుంది పోయే రూపాలు, ఒకరు నందమూరి తారక రామారావుగారు కాగా, మరొకరు అక్కినేని నాగేశ్వర రావు గారు. అయితే వారి తనయులుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వారి సినీ వారసులు నాగ్, బాలయ్య, ఇద్దరు తమ తమ సినిమాలతో సూపర్ హీరోలుగా ఎదిగారు. ఇక అదే క్రమంలో బాలకృష్ణ పౌరాణిక,జానపద,సాంఘిక చిత్రాల్లో నటించి మెప్పిస్తే..నాగార్జున భక్తిరస చిత్రాలు అన్నమయ్య,శ్రీరామదాసు,శిరిడీసాయి లాంటి చిత్రాలు తీసి మెప్పించాడు.
అయితే సినిమాల పరంగా ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా ఇద్దరూ కాస్త దూరంగా, అంటీఅంటనట్లుగా ఉంటునట్లు ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే బాలయ్య , నాగ్ బాక్స్ ఆఫీస్ వద్ద సైతం రగడ చేసిన ధాకలాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో బాలయ్య ఎక్కువ సార్లు పై చేయి సాధించినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే గత సంక్రాంతి బరిలో సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో మన్మథుడు నాగార్జున, డిక్టేటర్ సినిమాతో నందమూరి బాలకృష్ణలు సంక్రాంతి బరిలో నిలిచారు.
ఈ రెండు సినిమాలలో సోగ్గాడు కాస్త పైచేయి సాధించినట్లు తెలుస్తుంది. అయితే అదే వార్ ను కంటిన్యూ చేస్తూ…రానున్న సంక్రాంతి బరిలో మళ్లీ యుద్దానికి సిద్దం అవుతున్నారు ఈ ఇద్దరు. రానున్న 2017 సంక్రాంతికి బాలకృష్ణ తన 100 వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి గా రంగంలోకి దిగుతుంటే, మరోపక్క నాగ్ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చారిత్రాత్మక, భక్తి రస చిత్రం నమో వెంకటేశాయతో సంక్రాంతి బరిలో నిలిచి బాలయ్యకు పోటీకానున్నాడు. మరి వీరిలో హిట్ కొట్టేది ఎవరు…బరిలో నిలిచేడి ఎవరో చూడాలి.