మాతృకలో లేని కొత్త విషయాలను, కాంబినేషన్లను, కాన్సెప్ట్‌ను రీమేక్‌లలో యాడ్ చేస్తుంటారు కొందరు దర్శకులు. ఒక్కోసారి అవి క్లిక్ అయితే, చాలాసార్లు కథ సారాన్ని దెబ్బతీసి సినిమా బెడిసికొట్టేలా చేస్తాయి. తాజాగా ‘భీమ్లా నాయక్’ బృందం ఇలా మాతృకలో లేని పనులు చేస్తోందని సమాచారం. మలయాళంలో మంచి విజయం అందుకున్న ‘అయ్యప్పనుమ్ కొశియమ్’ సినిమాను టాలీవుడ్‌లో ‘భీమ్లా నాయక్’ పేరుతో రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా గురించి మరో ఆసక్తికర సమాచారం బయటకొచ్చింది. దాని ప్రకారం చూస్తే… ఈ సినిమాలో ఏడు పాటలు ఉంటాయట. అంటే ఆరు పాటలు సినిమాలో, ఒక నేపథ్య గీతం అంటున్నారు. ఆ నేపథ్య గీతాన్ని పవన్ కల్యాణ్ పాడారనేది టాక్. అయితే ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. కానీ మలయాళంలో అన్ని పాటలు లేవు. అక్కడ సినిమా ఎమోషన్స్ మీదే నడుస్తుంది. వాటి మధ్య పాటలు అడ్డు అనుకున్నారేమో అక్కడ పెట్టలేదు.
కానీ ఇప్పుడు తెలుగులో చూస్తే… ఏడు పాటలు పెడతాం అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సినిమాకు మంచి చేస్తుందో చూడాలి. ఇప్పటికే సినిమాలో రానా పాత్రలో హీరోయిజం తగ్గించి, విలనిజం పెంచారు అంటూ విమర్శలు వస్తున్నాయి. అందుకే టైటిల్‌లో ఇద్దరి పేర్లు కలవకుండా ఒక్క పవన్ పాత్ర పేరు మాత్రమే వచ్చేలా చూశారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇలాంటి మార్పుల పుకార్లు ఏం చేస్తాయో చూడాలి.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!