Pushpa Movie: ‘పుష్ప’ టీం కు మరో దెబ్బ.. లీకైన కీలక సన్నివేశం..!

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘పుష్ప ది రైజ్’ గా విడుదల కాబోతుంది.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్ రాజమండ్రి సమీపంలో మారేడుమిల్లి ప్రాంతంలో జరుగుతుంది. షూటింగ్ లొకేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

వాటితో పాటు ఓ కీలక సన్నివేశం కూడా లీక్ అవ్వడం చిత్ర యూనిట్ సభ్యులకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఓ కీలకమైన యాక్షన్ సన్నివేశాన్ని కాకినాడలోని పోర్ట్ ఏరియాలో చిత్రీకరించాడు దర్శకుడు సుకుమార్. ఈ సీనే నెట్లో వైరల్ అవుతుంది. ‘టూవీలర్ కోసమని ఫోన్లో మాట్లాడుండ నేను..యాపారం చేసే దానికే తిరుపతి నుంచి వచ్చిన్డాం’ అంటూ చిత్తూర్ యాసలో అల్లు అర్జున్ డైలాగ్ చెబుతున్నాడు. ఈ మధ్య కాలంలో వరుసగా ‘పుష్ప’ సినిమాకి సంబంధించి లీకులు అవుతున్నాయి.

ఇప్పటికే చాలా సీన్లు బయటకి వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాతలు సీరియస్ గా తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ యూనిట్ డైరెక్టర్ ను వారు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ ‘పుష్ప’ లీకులు ఆగకపోవడం గమనార్హం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus