ఈ ఏడాది రిలీజవుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. దాదాపుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఐదుసార్లు రిలీజ్ డేట్లు మారాయి. ఆర్ఆర్ఆర్ మార్చి 25వ తేదీన రిలీజవుతుందని ఆ సినిమా మేకర్స్ చెబుతున్నా రిలీజయ్యే వరకు తమకు నమ్మకం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మేకర్స్ కు మరో తలనొప్పి మొదలైందని తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు పెరగడంతో పాటు 100 శాతం ఆక్యుపెన్సీ అమలులోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే మార్చి లాస్ట్ వీక్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఐపీఎల్ టోర్నమెంట్ జరగనుంది. 10 జట్లు కావడంతో ఈ ఏడాది టోర్నమెంట్ ఎక్కువ రోజులు జరగనుందని సమాచారం అందుతోంది. ఐపీఎల్ వల్ల ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్ల విషయంలో నష్టపోయే ఛాన్స్ ఉంది.
అయితే చరణ్, తారక్ అభిమానులు మాత్రం ఆర్ఆర్ఆర్ కు పాజిటివ్ టాక్ వస్తే ఐపీఎల్ ప్రభావం ఆ సినిమాపై ఎక్కువగా ఉండకపోవచ్చని కామెంట్లు చేస్తున్నారు. యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాపై చరణ్, తారక్ భారీస్థాయిలో ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ సంచలనాలను సృష్టించడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్, తారక్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు ఉంటాయని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
రామ్ చరణ్ ఇప్పటికే తర్వాత ప్రాజెక్ట్ తో బిజీ కాగా తారక్ కూడా త్వరలో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. తారక్, చరణ్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండటం గమనార్హం. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.