టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ఆర్.ఆర్.ఆర్ సినిమా విడుదలైన రోజు ఉంచి ఇప్పటివరకు అన్ని విషయాల్లో పాజిటివ్ గా జరుగుతోంది. ఆచార్య సినిమా ఫ్లాప్ అయినా ఆ ప్రభావం రామ్ చరణ్ సినిమా కెరీర్ పై కొంత కూడా పడలేదు. ఇతర దేశాల్లో కూడా రామ్ చరణ్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
జపాన్ లో మూవీ ప్లస్ అనే సంస్థ ఇండియన్ సినిమా హీరోస్ కు సంబంధించి పోల్ నిర్వహించగా ఈ పోల్ లో చరణ్ నంబర్ వన్ స్థానంలో నిలవడం గమనార్హం. పాన్ ఇండియా స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. చరణ్, ప్రభాస్ ఈ జాబితాలో నిలవడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. జపాన్ లో కూడా చరణ్, ప్రభాస్ హవా చూపిస్తుండటం గమనార్హం.
సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుండగా ఆ పోస్ట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. రామ్ చరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లను జపాన్ లో కూడా విడుదల చేయాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చరణ్ సినిమాలన్నీ 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. రామ్ చరణ్ భిన్నమైన కథలకు ఎక్కువగా ఓటేస్తున్నారు.
(Ram Charan) చరణ్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుంది. రామ్ చరణ్ పారితోషికం 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. చరణ్ భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రామ్ చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా సినిమాలలో నటించే దిశగా అడుగులు వేస్తున్నారు.