Ram Charan: ఆ రికార్డును సొంతం చేసుకున్న రామ్ చరణ్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో భారీస్థాయిలో క్రేజ్ ఉంది. ఈ ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. కొత్త సినిమాలు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ మూవీ హవా కొనసాగుతోంది. కేజీఎఫ్2 సినిమా నుంచి పోటీ లేకపోతే ఈ సినిమా మరింత ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉండేది. ఇప్పటివరకు ఈ సినిమాకు 1070 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

Click Here To Watch NOW

ఆర్ఆర్ఆర్ సినిమా నటుడిగా చరణ్ ను మరో మెట్టు పైకి ఎక్కించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి చరణ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆచార్య మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయడం లేదు.

కేవలం ఐదు వారాల గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ మల్టీస్టారర్స్ చేయడం ద్వారా రామ్ చరణ్ వార్తల్లో నిలిచారు. గతంలో ఏ హీరో నటించిన మల్టీస్టారర్స్ ఇంత తక్కువ వ్యవధిలో రిలీజ్ కాలేదని సమాచారం. భవిష్యత్తులో ఈ అరుదైన రికార్డును ఏ హీరో అయినా బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. చరణ్ ఈ సినిమాలో 20 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన భలే భలే జంజారా సాంగ్ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఆచార్య సినిమాతో మణిశర్మ ఫామ్ లోకి వచ్చారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ ఆచార్య సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయస్సులో కూడా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుండటం గమనార్హం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus