Allu Arjun: పుష్ప టీజర్ తో బన్నీఖాతాలో కొత్త రికార్డ్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్1 సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో చేరుతుందని భావిస్తున్నారు. సుకుమార్ ఇప్పటికే పోస్టర్లు, టీజర్లతో పుష్ప సినిమాపై అంచనాలను పెంచారు. త్వరలో పుష్ప సినిమా ట్రైలర్ రిలీజ్ కానుండగా పుష్ప టీజర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. బన్నీ ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో ఊరమాస్ గా కనిపిస్తుండగా పుష్ప టీజర్ కు యూట్యూబ్ లో 89 మిలియన్ల వ్యూస్, 2 మిలియన్ల లైక్స్ వచ్చాయి.

ఈ స్థాయిలో లైక్స్ సాధించిన తొలి టాలీవుడ్ టీజర్ గా పుష్ప అరుదైన రికార్డును సొంతం చేసుకోవడంతో పాటు బన్నీ ఖాతాలో కొత్త రికార్డు చేరింది. ఈ టీజర్ కు ఏకంగా 4,66,000కు పైగా కామెంట్లు వచ్చాయి. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కానుండగా బన్నీ పుష్పరాజ్ పాత్ర కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు. బన్నీ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

రొటీన్ కథలకు నో చెబుతూ భిన్నమైన కథలను ఎంచుకోవడం ద్వారా విజయాలను సొంతం చేసుకోవాలని బన్నీ అనుకుంటున్నారు. బన్నీకి జోడీగా ఈ సినిమాలో రష్మిక మందన్నా నటిస్తున్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పుష్ప సినిమా రిలీజైన తర్వాత మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus