పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమా పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరుగుతుండగా పవన్ రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. తన గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేసినా ఆ కామెంట్ల గురించి స్పందించడానికి పవన్ పెద్దగా ఇష్టపడరు. పవన్ స్వభావం నచ్చి ఆయనకు ఫ్యాన్స్ అయిన వాళ్ల సంఖ్య లక్షల్లో ఉందని తెలుస్తోంది.
అయితే చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కనిపించే చరణ్ పాత్ర పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ను పోలి ఉంటుందని తెలుస్తోంది. చరణ్ పాత్రను చూస్తున్నంత సేపు అభిమానులకు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ రోల్ వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
ఈ సినిమాను 2024 ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తే బాగుంటుందని అలా రిలీజ్ చేస్తే ఈ సినిమాకు కూడా కచ్చితంగా ప్లస్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ రామ్ చరణ్ కెరీర్ ను సైతం ఛేంజ్ చేస్తుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. వరుస ప్రాజెక్ట్ లతో రామ్ చరణ్ కెరీర్ పరంగా బిజీగా ఉండటంతో పాటు కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమా సినిమాకు రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.