Adipurush: ‘ఆదిపురుష్‌’ టికెట్‌లపై పేటీఎం కొత్త ఆఫర్‌.. ఆడేసుకుంటున్న నెటిజన్లు!

సినిమా గురించి, సినిమా వాళ్ల గురించి ట్రోలింగ్‌ చేయడానికి పెద్ద కారణం అవసరం లేదు అంటుంటారు. చిన్న ఛాన్స్‌ దొరికితే చాలు అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఆ సినిమా టీమ్‌ ఛాన్స్‌ ఇస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా ‘ఆదిపురుష్‌’ సినిమా టీమ్‌లా ఉంటుంది అని చెప్పాలి. ఇప్పటికే ప్రచార చిత్రాల ద్వారా ట్రోలర్స్‌, మీమర్స్‌కి అవకాశం ఇచ్చిన ‘ఆదిపురుష్‌’ టీమ్‌ ఇప్పుడు సినిమా టికెట్‌ విషయంలో ట్రోలింగ్‌కి అవకాశం ఇస్తున్నారు. దీనికి కారణం పేటీఎం రీసెంట్‌గా చేసిన ఓ ట్వీట్‌.

‘ఆదిపురుష్‌’ (Adipurush) ఫ్యాన్స్‌ కోసం సినిమా టీమ్‌ ఆఫర్‌ను ప్రకటించింది. అదే ఒక టికెట్‌ కొంటే మరొకటి ఉచితం. అయితే దీనికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి అనుకోండి. పేటీఎం ద్వారా ఈ ఛాన్స్‌ పొందొచ్చు. అయితే ఒక టికెట్‌ కొంటే దాంతోపాటు మరో టికెట్‌ ఇస్తారని కాదు. జూన్‌ 30 వరకే ఉంటే ఈ ఆఫర్‌ కాస్త వెరైటీగా ఉంది అని చెప్పొచ్చు. డీల్‌ రూపంలో ఇచ్చిన ఈ ఆఫర్‌ను పొందాలంటే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

రూ. 100 చెల్లించాక ఓ ప్రోమో కోడ్‌ వస్తుంది. ఆ తర్వాత పేటీఎంలో టికెట్‌ బుక్‌ చేసుకునే ముందు ఆ కోడ్ అప్లై చేయాల్సి ఉంటుంది. అప్పుడు టికెట్‌ ప్రాసెస్‌ పూర్తయ్యాక రూ. 400 వరకు క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. అయితే కనీసం రూ. 350 ధర ఉన్న టికెట్‌ కొంటేనే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. అలా ఒక టికెట్‌ కొంటే ఆ టికెట్‌ డబ్బులు వెనక్కి వస్తాయి అని చెప్పొచ్చు.

ఈ లెక్కన రెండు టికెట్లు బుక్‌ చేయాల్సి వస్తే… ట్యాక్స్‌లు అన్నీ కలిపి రూ.700కిపైగా అవుతుంది. అప్పుడు పేటీఎం డీల్‌ ఆఫర్‌ కోడ్‌ని ఉపయోగిస్తే ఒక టికెట్‌ కొంటే మరో టికెట్‌ ఫ్రీగా వచ్చినట్లే అని చెబుతున్నారు. అయితే ఈ డీల్‌ వల్ల ఎన్ని టికెట్‌లు తెగుతాయి అనేది పక్కనపెడితే.. సినిమా రాకుండానే వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్‌ అంటూ ఎటకారాలు కొన్ని సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. ప్రభాస్‌ – ఓంరౌత్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా జూన్‌ 16న విడుదలకానుంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus