‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ హిందీలో నటించిన స్ట్రైట్ మూవీ ఇది. చాలా వరకు సినిమాలో బాలీవుడ్ క్యాస్టింగే ఉంది. ‘తానాజీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ఓం రౌత్ దర్శకుడు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. జూన్ 16 న ఈ మూవీ హిందీ, తెలుగుతో పాటు హిందీ,తమిళ భాషల్లో కూడా ఏక కాలంలో రిలీజ్ కాబోతోంది. అయితే ఇది ప్రభాస్ నటించిన హిందీ సినిమానే అయినప్పటికీ..
ఎక్కువ బిజినెస్ చేసేది మాత్రం తెలుగులోనే అని ప్రత్యేకంగా చెప్పనవసరం. కానీ మేకర్స్ మాత్రం తెలుగులో ఈ చిత్రాన్ని ఆసక్తిగా ప్రమోట్ చేయడం లేదు. మొదట తెలుగులో ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. కానీ ట్రైలర్ మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇది హిందీ ప్రేక్షకుల కోసం తీసిన రామాయణమే అయినప్పటికీ.. ‘రామాయణం’ ఎప్పుడు వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ చూడటానికి సిద్దంగానే ఉంటారు.
ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరో నటించాడు కాబట్టి.. ఇప్పటి జెనరేషన్ కూడా రామాయణం గురించి ఇంకా డీప్ గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం.తెలుగులో ఈ చిత్రాన్ని ఏకంగా రూ.170 కోట్ల రేటుకి కొనుగోలు చేశారు. ప్రమోషన్ కనుక చేయకపోతే మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదవ్వకపోవచ్చు.
మరి ఆదిపురుష్ (Adipurush) టీం ఆలోచన అలా ఉందో తెలీదు కానీ.. ఇప్పటికైతే పాటలు వదిలేసి అదే ప్రమోషన్ అనుకోమంటున్నారు. కనీసం రిలీజ్ కు రెండు వారాల ముందు నుండీ అయినా సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తారో లేదో చూడాలి.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!