సమంత సాంగ్ వచ్చేసింది..సుకుమార్ మార్క్ ఐటెం సాంగ్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే పూర్తయ్యింది. డిసెంబర్ 17న ప్రేక్షకుల ‘పుష్ప’ మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సినిమాకు సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఇప్పటివరకు ‘పుష్ప’ నుండీ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అని అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా ‘పుష్ప’ ఏక కాలంలో విడుదల కానుంది.’ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం కావడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రం నుండీ ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ పక్కాగా ఉంటుంది. ఇక ఈ ఐటెం సాంగ్ కు సమంత వంటి స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేసుకున్నారు

అంటే రచ్చ మాములుగా ఉంటుందా? అయితే ఆ పాట ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నకి తాజాగా సమాధానం దొరికింది. ‘ఉ అంటావా… ఉఊ అంటావా’ అనే సాంగ్ మాస్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకునే అవకాశం ఎంతైనా ఉంది.కానీ క్లాస్ ఆడియెన్స్ కు నచ్చుతుందా అనేది సందేహమే. మాస్ ఆడియెన్స్ కు ఈ పాట మరో ‘జిగేల్ రాణి’. కానీ క్లాస్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసే అంశం ఒక్క సమంత గ్లామర్ మాత్రమే.

చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటకి ఇంద్రావతి చౌహాన్ గాత్రం అందించింది. ఎంతో హుషారుగా ఆమె ఈ పాట పాడినట్టు స్పష్టమవుతుంది. అయితే ఈ పాటలో కొన్ని పదాలు మగవాళ్ళ పై సెటైర్లు వేసే విధంగా ఉన్నాయి. ‘సమంత కావాలనే ఈ పదాలు పెట్టించుకుని సెటైర్లు వేసిందేమో’ అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus