మ్యాస్ట్రో ఇళయరాజా పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఆయన స్వరపరిచిన ప్రతి సాంగ్ అద్భుతం. ఇళయరాజా సంగీతమందించిన సినిమాల్లో గీతాంజలి కి ప్రత్యేక స్థానం ఉంది. అందులోని ఒక్కొక్క పాట యువత హృదయాలను మీటింది.
“ఓ పాపా లాలి ” గీతం అయితే నేటి యువకులను సైతం మ్యూజిక్ మత్తులోకి తీసుకు పోతోంది. అందుకే ఆ పాటకు కొంత బీట్ జోడించి “ఆష్కర్ ది బ్యాండ్” వాళ్ళు రూపొందించిన కవర్ వీడియో కిరాక్ పుట్టిస్తోంది. కాలేజీ వార్షికోత్సవాల్లో ఈ వెర్షన్ ట్రెండ్ కావడం ఖాయం.