‘పలాస 1978’ ‘లండన్ బాబులు’ వంటి సినిమాలతో అలరించి ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు రక్షిత్ అట్లూరి. అయితే తర్వాత చేసిన ‘నరకాసుర’ పూర్తిగా నిరాశపరిచింది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని భావించి తన తండ్రి వెంకట సత్య దర్శకత్వంలోనే ‘ఆపరేషన్ రావణ్’ అనే సినిమా చేశాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రక్షిత్ అట్లూరికి హిట్ ఇచ్చిందో లేదో తెలుసుకుందాం రండి :
కథ : రామ్(రక్షిత్ అట్లూరి) tv45 అనే ఛానల్లో జర్నలిస్ట్ గా చేరతాడు. ఆమని(విపిన్ సంగీర్తన) కి ఇతను అసిస్టెంట్ గా కీలక బాధ్యతలు చేపడతాడు. ఆమని ఓ సిన్సియర్ జర్నలిస్ట్. అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి(రఘు కుంచె) అక్రమాలకు సంబంధించి ఆమె కీలక వివరాలు సేకరిస్తుంది. వీటితో లైవ్ చేసి అతని బాగోతాన్ని బయటపెట్టాలని ఆమె ప్రయత్నిస్తుంది. అయితే అలా చేస్తే వారికి వచ్చే ప్రాజెక్టులు ఆగిపోతాయేమో అని భయపడి పై అధికారులు ఆమెను అడ్డగిస్తారు. వేరే ఛానల్లో చేరితే ఆమె ఆ వివరాలు ఎక్కడ వాళ్లకి ఇచ్చేస్తుందో అని భావించి..
ఆమెను క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ కి మార్చేస్తారు. ఈ క్రమంలో పెళ్లి కుదిరిన అమ్మాయిలు వరుసగా హత్య చేయబడతారు. వారిని హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్.. చంపిన తర్వాత వాళ్ళ చేతులను నరికేస్తూ ఉంటాడు. రామ్, ఆమని కూడా ప్రేమలో ఉంటారు. తర్వాత పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. ఆ టైంలో ఆమనిని కూడా కిడ్నాప్ చేస్తాడు ఆ సీరియల్ కిల్లర్. తర్వాత ఏమైంది? రామ్ ఆమనిని రక్షించగలిగాడా? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎందుకు పెళ్లి కుదిరిన అమ్మాయిలనే టార్గెట్ చేశాడు? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : రక్షిత్ అట్లూరి తన ప్రామిసింగ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకోవాలని ప్రయత్నించాడు. ఫస్ట్ హాఫ్ లో అతని నటన బాగానే ఉంది. కానీ సెకండాఫ్ లో.. అతని పాత్రకి పెద్దగా వెయిట్ లేకుండా పోయింది. విపిన్ సంగీర్తన డౌట్ లేకుండా మలయాళం నుండి టాలీవుడ్ కి దిగుమతి అయిన మరో ప్రామిసింగ్ నటి అని చెప్పొచ్చు.
ఈ సినిమాలో కూడా తన నటన డీసెంట్ గానే ఉంది. సీనియర్ నటి రాధిక పెర్ఫార్మన్స్ డీసెంట్ గానే ఉంది. చరణ్ రాజ్ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ ఫుల్ గా లేదు. రఘు కుంచె, జర్నలిస్ట్ మూర్తి, ఎస్ ఎస్ కాంచి వంటి వారి పాత్రలు గెస్ట్ రోల్స్ ను తలపిస్తాయి. మిగిలిన వాళ్ళ పాత్రలు పెద్దగా గుర్తుండవు.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు వెంకట సత్య ఎంపిక చేసుకున్న లైన్ బాగుంది. సినిమా స్టార్టింగ్ 10 నిమిషాలు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. రఘు కుంచె ట్రాక్ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ అనూహ్యంగా అతని పాత్రని తప్పించి సీరియల్ కిల్లర్ ట్రాక్ కి కథ మళ్లుతుంది. ఇంటర్వెల్ పోర్షన్ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ కీలకమైన సెకండాఫ్ స్టార్టింగ్ నుండి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సైకో కిల్లర్ బ్యాక్ స్టోరీ బాగానే డిజైన్ చేసుకున్నా.. ‘మొదటి హత్య తర్వాత మిగిలిన హత్యలు అతను ఎందుకు చేస్తున్నాడు?’ అనే విషయంలో డీటెయిలింగ్ కుదర్లేదు.
రాధిక పాత్రకి ఇచ్చిన ఎండింగ్ కూడా రొటీన్ గా, ముందుగానే అంచనా వేసే విధంగా ఉంది. సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్ నెరేషన్ ఉంటే బాగుండేది. థ్రిల్స్ కూడా లేకపోవడం మైనస్. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ సో సోగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్టు ఉన్నాయి. రన్ టైం 2 గంటల 27 నిమిషాలే ఉండటం కూడా కొంత ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
విశ్లేషణ : ‘ఆపరేషన్ రావణ్’ ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అయినా.. ఆ తర్వాత వీక్ స్క్రీన్ ప్లే,డైరెక్షన్ కారణంగా … ఓ బోరింగ్ సైకో థ్రిల్లర్ గా మిగిలిపోయింది. ఓటీటీలో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ సాయంతో ఒకసారి ట్రై చేయొచ్చు కానీ థియేటర్లలో కష్టమే.
రేటింగ్ : 2/5
ఫోకస్ పాయింట్ : ఆపరేషన్ సక్సెస్ కాలేదు
Rating
2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus