Ori Devuda OTT: సైలెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన ‘ఓరి దేవుడా’..ఎప్పుడు..ఎందులో?

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓరి దేవుడా’? తమిళంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ఓ మై కడవలే కి ఈ మూవీ రీమేక్. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా న‌టించిన‌ చిత్రం ‘ఓరి దేవుడా’. పి.వి.పి బ్యాన‌ర్‌పై ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అశ్వ‌త్ మారి ముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. స్టార్ హీరో వెంకటేష్ ఈ మూవీలో దేవుడు పాత్రలో న‌టించారు. దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 21న ఈ మూవీ రిలీజ్ అయ్యింది.

మొదటిరోజు ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది కానీ బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే పెర్ఫార్మ్ చేసింది. విశ్వక్ సేన్ సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. అయితే ఓటీటీల్లో మాత్రం బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఓరి దేవుడా ఓటిటి రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది. నవంబర్ 11 నుండీ ఆహా లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి..ఇక్కడ ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. సినిమా విడుదలైన 5 వ వారంలో ఈ మూవీ ఓటిటి రిలీజ్ కాబోతుంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus