ఆర్మాక్స్ సర్వే ఏప్రిల్ నెల ఫలితాలు తాజాగా వెలడి కాగా ఈ ఫలితాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆర్మాక్స్ సర్వే మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాలో మరోమారు ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ప్రభాస్ (Prabhas) తొలి స్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభాస్ తర్వాత రెండో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నిలిచారు. మహేష్ బాబు ఈ జాబితాలో రెండో స్థానంలో నిలవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది.
మహేష్ రాజమౌళి (Rajamouli) కాంబో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఆర్మాక్స్ సర్వేలో మూడో స్థానంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నిలిచారు. అల్లు అర్జున్ (Allu Arjun) , రామ్ చరణ్ (Ram Charan), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ జాబితాలో 4, 5, 6 స్థానాలలో నిలవడం గమనార్హం. న్యాచురల్ స్టార్ నానికి (Nani) ఈ జాబితాలో ఏడో స్థానం దక్కగా మాస్ మహారాజ్ రవితేజకు (Ravi Teja) ఎనిమిదో స్థానం దక్కింది.
స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలవడం గమనార్హం. మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచారు. కొంతమంది టాలెంటెడ్ స్టార్ హీరోలకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం ఫ్యాన్స్ కు బాధ కలిగిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది స్టార్ హీరోలు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపును సొంతం చేసుకుని ప్రశంసలు అందుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలకు క్రేజ్ సైతం అంతకంతకూ పెరుగుతోంది. టాలీవుడ్ స్టార్స్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.