Bigg Boss 7 Telugu Winner: దద్దరిల్లిపోతున్న బిగ్ బాస్ స్టేజ్..! గ్రాండ్ ఫినాలే అప్టేడ్స్ ఏంటంటే.?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్దం అయ్యింది. శనివారం నుంచీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అయితే, ఈసారి ఎలాంటి లీక్స్ లేకుండా బిగ్ బాస్ టీమ్ జాగ్రత్తలు తీస్కుంది. కేవలం గతంలో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్, అలాగే వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రమే సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. రెండు రోజులు పాటుగా వాళ్లకి అక్కడే వసతులు కల్పించారు. ఎలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శనివారం కొంతపార్ట్ షూటంగ్ చేసిన తర్వాత ముగ్గురిని ఎలిమినేట్ చేస్తారు.

ఆ తర్వాత మిగతా టాప్ – 3 మెంబర్స్ ని ఆదివారం ఎలిమినేట్ చేస్తూ, పైనల్ గా విన్నర్ ఎవరో చెప్తారు. అంటే, ఆదివారం షూటింగ్ అయితేనే తప్ప విన్నర్ ఎవరు అనేది బయటకి రాదు. ఇక అన్ అఫీషియల్ గా లెక్కలు చూస్తుంటే రైతు బిడ్డనే విన్నర్ అయ్యేలాగా కనిపిస్తున్నాడు. ఓటింగ్ ఆర్డర్ ఒక్కసారి చూసినట్లయితే., పల్లవి ప్రశాంత్ అన్ అఫీషియల్ పోలింగ్స్ లో టాప్ లో ఉన్నాడు. 34 పర్సెంట్ వరకూ ఓటింగ్ కైవసం చేసుకున్నాడు.

ఆ తర్వాత శివాజీ 25 పర్సెంట్, అమర్ దీప్ 24 పర్సెంట్ తో ఉన్నారు. మరి అఫీిషియల్ లెక్కల ప్రకారం కూడా ఇలాగే ఉంటే రైతుబిడ్డనే ఈ సీజన్ విన్నర్ అని చెప్పచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా షోలోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు 50 లక్షల ప్రైజ్ మనీని అందుకోబోతన్నట్లుగానే కనిపిస్తోంది.

అంతేకాదు, బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఎలాంటి ట్విస్ట్ ఇవ్వకుండా విన్నర్ డిసైడ్ అయ్యేవరకూ వైయిట్ చేస్తే మాత్రం మొత్తం క్యాష్ ప్రైజ్ అనేది పల్లవి ప్రశాంత్ కే వస్తుంది. వీటితో పాటుగా బ్రీజా కార్, జాస్ అలూకాస్ వారి 15లక్షలు విలువ గల డైమెండ్ నెక్లెస్ కూడా వస్తుంది. ఇక ఈ ప్రైజ్ మనీతో పేదరైతులని ఆదుకుంటానని చెప్పాడు పల్లవి ప్రశాంత్. కాబట్టి రైతు బిడ్డనే విన్నర్ ని చేస్తాడనే అనిపిస్తోంది.

గ్రాండ్ ఫినాలేలో సూట్ కేస్ కోసం ఎవరైనా ఆసక్తిగా తీస్కుంటే మాత్రం ప్రైజ్ మనీ తగ్గిపోతుంది. టాప్ త్రీ లో పల్లవిప్రశాంత్, శివాజీ ఇంకా అమర్ దీప్ ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఫినాలేలో ఎక్స్ హౌస్ మేట్స్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ కూడా ఉండబోతోంది. శోబాశెట్టి, అశ్విని, శ్రీసత్య, మెహబూబ్ ఇలా వీళ్ల డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఉండబోతోందనే అంటున్నారు. చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అనేది ఇంకా కన్ఫార్మ్ కావాల్సి ఉంది. అదీ మేటర్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus