సౌత్‌లో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం ఇటీవల కాలంలో పెరిగింది. తెలుగు, తమిళ, కన్నడ.. ఇలా అన్నింటా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అలాంటి సినిమాలకు బూస్ట్ ఇవ్వడానికి రాబోయే నెల రోజులు చాలా కీలకం. రాబోయే నెల రోజుల కాలంలో వరుస పాన్ ఇండియా సినిమాలు వరుస కడుతున్నాయి. వాటితో సుమారు సినిమా ఇండస్ట్రీలో 1000 కోట్ల రూపాయాల వ్యాపారం జరుగుతోంది. దీంతో ఈ నెల పాన్ ఇండియా టైమ్.
‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ లాంటి సినిమాలు మన సినిమా సత్తాను పాన్ ఇండియా లెవల్‌లో చూపించాయి. ఆ తర్వాత ‘పుష్ప’ వాటికి యాడ్ ఆన్ అయ్యింది. దీంతో చాలామంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘కేజీయఫ్ 2’, ‘రాధేశ్యామ్’ లాంటి సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధమయ్యాయి. ఇవి కూడా మంచి విజయాల్ని అందుకుంటే… రాబోయే కాలంలో మరిన్ని సినిమాలు చూడొచ్చు. ప్రభాస్ – పూజా హెగ్డేతో అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు రాధాకృష్న.
ఈ సినిమా బడ్జెట్ సుమారు ₹300 కోట్లు అని సమాచారం. ఈ నెల 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మరో పాన్ ఇండియా సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ నెల 25నే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన ఈ సినిమాకు నిర్మాత రూ.500 కోట్లకుపైగా ఖర్చు పెట్టారని అంటున్నారు. తెలుగు చలన చిత్ర సీమ నుండి ఈ రెండు పాన్ ఇండియా పోరులో ఉన్నాయి.
ఇక మరో పాన్ ఇండియా సినిమా అంటే ‘కేజీయఫ్ 2’. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా ఇది. ‘కేజీయఫ్’కి వచ్చిన బజ్ ప్రకారం చూస్తే… ఈ రెండో పార్ట్‌కు వసూళ్ల సునామీ పక్కా అంటున్నారు. ఈ సినియమాకు ₹100 కోట్లకుపైగా ఖర్చు చేశారని సమాచారం. ఇవి కాకుండా చిరంజీవి ‘ఆచార్య’, విజయ్ ‘బీస్ట్’, మహేష్‌బాబు ‘సర్కారు వారి పాట’, అడివి శేష్ ‘మేజర్’ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవల్‌లోనే విడుదలవుతున్నాయి. ఇవన్నీ కలిపితే సౌత్ బాక్సాఫీసు పాన్ ఇండియా పందెం వెయ్యి కోట్ల రూపాయలు దాటిపోతోంది. సో ఇక ఆ సినిమాల్ని చూసి ఆశీర్వదించడం మన పని.