తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణవంశీ చాలా రోజుల తర్వాత రంగమార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. రమ్యకృష్ణ ప్రకాష్ బ్రహ్మానందం అనసూయ వంటి తదితరులు ప్రధాన పాత్రలో నటించినటువంటి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ మీడియాలో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఇకపోతే ఈ సినిమాపై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ తన అభిప్రాయాలను, తన విశ్లేషణలను తెలియజేశారు.రంగమార్తాండ సినిమాని తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నటువంటి పిల్లలకు తప్పకుండా చూడాలని ఈయన తెలియజేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా ప్రకాష్ రాజ్ మోనో సినిమా అని చెప్పాలి ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ నటన అద్భుతమని పరుచూరి వెల్లడించారు.
ఇక ఈ సినిమాలోని (Rangamarthanda) నటీనటుల గురించి వారి నటన గురించి ఈయన విశ్లేషిస్తూ వారి నటన అద్భుతమని తెలిపారు.ఇక ఈ సినిమా చూసిన తర్వాత తల్లిదండ్రులకు దూరంగా ఉన్నటువంటి పిల్లలు తిరిగి వారి వద్దకు వచ్చి ఉంటే కృష్ణవంశీ ప్రకాష్ రాజ్ జన్మ ధన్యమయ్యేదని తెలిపారు. ఇక రాఘవరావు (ప్రకాష్ రాజ్) కళాభారతి ఎదుట కన్నుమూయడం పిల్లలందరూ తనని చూడటానికి రావడం వంటి సన్నివేశాలతో క్లైమాక్స్ చూపించారు. అయితే ఇలా కాకుండా రాఘవరావు కుటుంబంతో తిరిగి కళాభారతిని నిర్మించి ఉంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఇలా కళాభారతి నిర్మాణాన్ని చేపట్టి రాఘవరావు సౌజన్యంతో అనే చివరి షాట్ పడి ఉంటే అద్భుతంగా ఉండేదని తెలిపారు. అలాగే బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ నటన ప్రావీణ్యం తెలిసేలా వారిద్దరి మధ్య మరికొన్ని సన్నివేశాలను కనుక తీసి ఉంటే సినిమా మరికొన్ని వసూలను రాబట్టేదని పరుచూరి వెల్లడించారు.ఇక ఈ సినిమా చూసిన తర్వాత కన్నీళ్లు రావు అనేవారికి కూడా కన్నీళ్లు వస్తాయని పరుచూరి ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.