ప్రతి హీరోకు ఓ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకునేవాళ్లు, ఆ హీరోతోనే తన సినిమా అన్నాక కథను తీర్చిదిద్దుకునేవాళ్లు కచ్చితంగా బాడీ లాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. చాలామంది దర్శకులు ఇదే పని చేస్తుంటారు. అయితే ఈ బేసిక్ సూత్రాన్ని మరచిపోయినప్పుడు ఆ సినిమా, ఆ పాత్ర బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది అంటుంటారు. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇదే మాట చెప్పారు. ఈ క్రమంలో ఆయన ‘ఆచార్య’, ‘అల్లరి పిడుగు’ సినిమాల గురించి, అందులో హీరోల పాత్రల గురించి వివరించారు.
కథానాయకుడి బాడీ లాంగ్వేజ్ బట్టి కథలు, అందులోని సన్నివేశాలు ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తారు అంటూ పరుచూరి గోపాలకృష్ణ తన ‘పరుచూరి పాఠాలు’ కొత్త ఎపిసోడ్‌లో చెప్పుకొచ్చారు. చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన ‘ఆచార్య’ గురించి ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. చిరంజీవి నక్సలైట్ పాత్ర పోషించడంతో కొన్ని పరిమితులకు లోబడి నటించాల్సి వచ్చింది అని చెప్పారు గోపాలకృష్ణ. అలాగే గతంలో ‘శంకర్‌దాదా జిందాబాద్’ చేస్తున్నప్పుడు ఆ సినిమా చిరు బాడీ లాంగ్వేజ్‌కు సరిపోదని చెప్పానన్నారు గోపాలకృష్ణ.
చిరంజీవి ఇమేజ్ మహా వృక్షం లాంటిది. అలాంటి వ్యక్తి ‘శాంతి’ వచనాలు చెబితే ప్రేక్షకులకు రుచించదని అప్పట్లో చిరంజీవి దృష్టికి తీసుకొస్తే, ‘‘మీరు కాస్త రెబల్ కాబట్టి, మీకు పెద్దగా నచ్చదులేండి’’ అన్నట్లు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారట. ఎందుకంటే ‘శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు’లోనూ ఎన్టీఆర్ ఇలాగే నటిస్తే ఆ సినిమా దెబ్బతింది అని నాటి రోజులు గుర్తు చేసుకున్నారు గోపాలకృష్ణ. చిరంజీవిలాంటి హీరోకు ఉన్న అభిమానగణం తమను ఎంటర్‌టైన్‌చేసేలా సినిమా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారని పరుచూరి గోపాకృష్ణ వివరించారు.
బాలకృష్ణ ‘అల్లరి పిడుగు’ సమయంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేసుకున్నారు గోపాలకృష్ణ. అందులో తండ్రి పాత్ర ఆయననే వేయమని రిక్వెస్ట్ చేశానని ఆయన గుర్తు చేశారు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని, ఓ కొత్త నటుడిని చూసి బాలకృష్ణ భయపడుతుంటే జనానికి నచ్చదు అని చెప్పాను అని వివరించారు. కానీ, ఆ రోజు దర్శకుడు, నిర్మాత అంగీకరించలేదని, ఆ తర్వాత దెబ్బతిన్నారని గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ స్టామినాకు ఆయన ఎవరికో భయపడకూడదు. ‘పెద్దన్నయ్య’లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తే.. అందరూ చూశారు, నచ్చింది కూడా అని గుర్తు చేశారు. గోపాలకృష్ణ.
Most Recommended Video
అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!