సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మరణించి 10 రోజులు దాటినా… ఇంకా ఆయన మరణవార్తని ఆయన అభిమానులు కానీ సినీ పెద్దలు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం టాలీవుడ్ కు తీరని లోటు అని కొంతమంది అంటుంటే మరికొంతమంది పాట బ్రతికున్నంత వరకు సిరివెన్నెల సీతారామశాస్త్రిని అందరూ స్మరించుకుంటూనే ఉంటారని మరికొంతమంది అంటున్నారు. ఇదిలా ఉండగా.. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం గురించి ఆయన అనారోగ్యం గురించి ప్రముఖ రచయిత నటుడు అయిన పరుచూరి గోపాలకృష్ణ గారు కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
ఆయన మాట్లాడుతూ… “సిరివెన్నెల సీతారామశాస్త్రి … ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉండేవారు. మీరు కనుక సరిగ్గా గమనిస్తే… ఆయన నవ్వు లేకుండా ఒక్క ఫోటో కూడా ఉండదు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ఆయన నవ్వుతూనే ఉండేవారు. ఈ కారణంగానే ఆయన్ని నేను ‘చిరునవ్వుల సీతారామశాస్త్రి’ అనేవాడిని. అప్పుడు ఆయన మరింతగా నవ్వేవారు.నాకు తెలిసి ఒక 6 ఏళ్ళ నుండీ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో పోరాడుతూ కూడా ఆయన పెదవి పై చిరునవ్వును చెదరనివ్వలేదు ఆ మహానుభావుడు.మేము ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆరేడేళ్లకు ఆయన ఇండస్త్రీకి వచ్చారు.
‘సిరివెన్నెల’ చిత్రానికి అన్ని పాటలు ఆయనే రాయడం జరిగింది. అంధులో విధాత గురించి కూడా ఒక పాట రాశారాయన. ఆ విధాతే ఆయనకి అన్యాయం చేసి 65 ఏళ్లుకు ఆయన్ని పట్టుకుపోయాడు. ఇది నిజంగా చింతిచాల్సిన విషయం. సిరివెన్నెల 3వేల పాటలే రాశారని మీకు తెలుసా. కానీ ఆయనకి ఉన్న ఇమేజ్ కు 10 వేల పాటలవరకూ రాసే అవకాశం ఉంది. కానీ ఆయన రాసేవారు కాదు. అనవసరమైన సన్నివేశాలకి,అనవసరమైన సందర్భాలకి ఆయన రాయను అనేవాడు. అంతేకాదు దర్శకుడు చెప్పేతీరు నచ్చకపోయినా ఆయన రాను పొమ్మనేవాడు.
లేదంటే ఆయన పేరు మీద వేటూరి గారికి ఉన్న రికార్డు ఉండేది. వేటూరి గారి పోయాక సిరివెన్నెల ఆయన స్థానాన్ని అధిష్టించారు.అలాంటి సిరివెన్నెల ఇక లేరు అంటే నాకు దుఃఖం ఆగడం లేదు. ఈ విషయమై భగవంతుడిని నాకు నిలదీయాలని ఉంది.వ్యక్తిత్వంలో సూర్యుడు .. రచనల్లో చంద్రుడు మన సిరివెన్నెల. ‘పాట .. పాట .. అదే ఆయన ద్యాస శ్వాస .. అదే ఆయన జీవనాడి .. అదే ఆయన జీవన వేదం. నిరంతరం పాట గురించే పరితపించేవారు.ఆయన కన్ను మూసేవరకు, శ్వాస ఆగేవరకు ఆయన కలం కదలడం ఆగలేదు. అటువంటి మహానుభావుడికి పుణ్యలోక ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!