Paruchuri Gopala Krishna: కన్నీళ్లు పెట్టకపోతే నాకు మెసేజ్ పెట్టండి.. పరుచూరి కామెంట్స్ వైరల్!
- April 11, 2023 / 04:41 PM ISTByFilmy Focus
ప్రముఖ నటుడు పరుచూరి గోపాలకృష్ణ ఈ మధ్య కాలంలో సినిమాలకు సంబంధించి తనదైన శైలిలో రివ్యూలు ఇస్తూ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా బలగం సినిమా గురించి రివ్యూ ఇచ్చిన పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి పాజిటివ్ గా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒక సినిమాకు ఏది బలమో అది బలగంలో ఉందని పరుచూరి అన్నారు. బలగం మూవీ వినూత్నమైన ప్రయోగం అని పరుచూరి తెలిపారు. దిల్ రాజు సైతం ఈ స్థాయిలో ఈ సినిమా విజయం సాధిస్తుందని భావించి ఉండరని ఆయన కామెంట్లు చేశారు.
పెట్టిన ఖర్చుతో పోల్చి చూస్తే ఈ సినిమాకు పది రెట్లు ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయని (Paruchuri Gopala Krishna) పరుచూరి అభిప్రాయపడ్డారు. సినిమాకు కథే ముఖ్యమని ఈ సినిమా ప్రూవ్ చేసిందని పెద్ద బడ్జెట్ సినిమాలకు సమానంగా ఈ సినిమా ఆదరణను సొంతం చేసుకుందని పరుచూరి వెల్లడించారు. వేణులో ఇంత టాలెంట్ ఉందని నేను ఊహించలేదని ఆయన అన్నారు. కామెడీ చేసే వేణు గుండెలకు హత్తుకునే సినిమా తీశాడని పరుచూరి కామెంట్లు చేశారు.

బలగం క్లైమాక్స్ చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెడతారని బలగం సినిమాలో ఒక ఫ్యామిలీ కలుస్తుందంటే ఎమోషనల్ అవుతామని పరుచూరి అభిప్రాయపడ్డారు. బలగం సినిమా చూసి కన్నీళ్లు పెట్టకపోతే నాకు మెసేజ్ పెట్టాలని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వాళ్లు ఈ మూవీని చూడాలని ఆయన కోరారు. ఒళ్లు గగుర్పాటుకు గురి కాకుండా ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు రారని పరుచూరి చెప్పుకొచ్చారు.

కుటుంబాలు విచ్ఛిన్నమైతే ఆత్మ ఘోసిస్తుందనే విషయాన్ని చెప్పిన సినిమా బలగం అని ఆయన తెలిపారు. పరుచూరి గోపాలకృష్ణ రివ్యూతో ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వాళ్లు సైతం ఈ సినిమాపై దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది.
రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!














