సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వీరసింహారెడ్డి మూవీ అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమాను తాజాగా ఓటీటీలో చూసిన పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాకు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సినిమాను చూస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ నటించిన చండ శాసనుడు మూవీ గుర్తొచ్చిందని ఆయన తెలిపారు. ఈ రెండు సినిమాలలో కథా బీజం ఒకటేనని ఆయన అన్నారు. చండశాసనుడు సినిమాలో హీరో చెల్లికి మంచి భర్త ఉంటాడని వీరసింహారెడ్డి సినిమాలో మాత్రం హీరో చెల్లి విలన్ ను పెళ్లి చేసుకుంటుందని పరుచూరి అభిప్రాయం వ్యక్తం చేశారు.
వీరసింహారెడ్డి మూవీ చూస్తుంటే బోయపాటి శ్రీను మూవీ చూస్తున్న ఫీల్ వచ్చిందని బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయని ఆయన తెలిపారు. సింహా, లెజెండ్ లో చూసిన విధంగా వీరసింహారెడ్డిలో బాలయ్య నటన, డైలాగ్స్, హావభావాలు ఉన్నాయని పరుచూరి పేర్కొన్నారు. వీరసింహారెడ్డి ఫస్టాఫ్ బంగారమని సెకండాఫ్ అదే స్థాయిలో లేదని నా ఒపీనియన్ అని ఆయన కామెంట్లు చేశారు.
మూవీలోని సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ కు అంత సమయం కేటాయించాల్సిన అవసరం లేదని నవీన్ చంద్ర ఆత్మహత్య చేసుకున్నట్టు చూపించి ఉంటే మూవీ ఆడేది కాదని ఆయన పేర్కొన్నారు. వీరసింహారెడ్డి పాత్రను ముగించి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం సినిమాకు ప్రాథమిక లోపమని ఆయన అన్నారు. వీరసింహారెడ్డి పాత్ర చనిపోయాడని తెలిస్తే ప్రేక్షకులకు ఒక విధంగా నిరాశ వచ్చేస్తుందని పరుచూరి కామెంట్లు చేశారు.
చిన్నచిన్న తప్పిదాలను అధిగమించి ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్టైందంటే ఒకే ఒక్క రీజన్ బాలయ్య అని ఆయన చెప్పుకొచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లతో కొంతమంది ఏకీభవిస్తుండగా మరి కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. వీరసింహారెడ్డి విడుదలై 50 రోజులైనా ఈ మూవీ గురించి చర్చ జరుగుతుండటం గమనార్హం. వీరసింహారెడ్డి సినిమా బాలయ్య కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.