తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప రచయితగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పరుచూరి గోపాలకృష్ణ పరిచూరి పలుకులు అనే కాన్సెప్ట్ తో వివిధ సినిమాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోని ఈయన తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి తనదైన శైలిలో విశ్లేషణ ఇచ్చారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో తాను ఎన్టీఆర్ రామ్ చరణ్ లను చూడలేదని కేవలం అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ లను మాత్రమే చూసానని తెలిపారు.
ఈ రెండు పాత్రలను రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, ఈయన ఈ ఇద్దరినీ తన రెండు కళ్ళుగా బావించి చూపించారని పరుచూరి పేర్కొన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర నిడివితో పోలిస్తే చరణ్ పాత్ర నిడివి ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే కానీ, ఒక పాత్ర నిడివి పెట్టి ఆ పాత్ర ప్రాధాన్యత అంచనా వేయలేమని తెలిపారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎంతో కష్టతరంతో కూడుకున్నదని
ఈయన ఒక గొప్ప సంకల్పం కోసం బ్రిటిష్ వారి దగ్గర పనిచేస్తున్న విషయం ప్రేక్షకులకు తెలియకుండా ఎంతో అద్భుతంగా నటించారని ఈ విషయంలో రామ్ చరణ్ ఏమాత్రం తడిపడిన సినిమాపై ప్రభావం చూపేదని పరుచూరి వెల్లడించారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివిఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ పాత్రకు అన్యాయం చేశారని ఎన్టీఆర్ పాత్రను తొక్కేసారని మాటలలో ఏమాత్రం వాస్తవం లేదని, ఇద్దరి పాత్రలకు దర్శకుడు సమానంగా న్యాయం చేశారని
ఈయన తెలుపుతూనే పరోక్షంగా రామ్ చరణ్ పాత్ర హైలెట్ ఉందంటూ తెలిపారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అద్భుతమైన సన్నివేశాలు, అక్కడ ఉన్నప్పటికీ చరణ్ పాత్రను ఎలివేట్ చేశారన్నది నిజం.